Sun Dec 22 2024 15:18:19 GMT+0000 (Coordinated Universal Time)
వాల్తేరు వీరయ్య ఫస్ట్ డే కలెక్షన్స్
గతేడాది విడుదలైన చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ తొలిరోజు రూ.12.97 కోట్లు మాత్రమే వసూలు చేయగా..
సంక్రాంతి కానుకగా శుక్రవారం (జనవరి 14) విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య.. వసూళ్లలో అదరగొడుతోంది. తొలిరోజు ఏకంగా రూ.29 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. అన్నిభాషల్లో కలిపి ఈ వసూళ్లు సాధించినట్లు తెలిపింది. తమ అభిమాన హీరో, మెగా బాస్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డ్యాన్సులు, ఫైట్స్, డైలాగ్ లతో వింటేజ్ చిరుగా.. చిరంజీవి అదరగొట్టారని ఇప్పటికీ.. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
చిరంజీవితో పాటు.. మాస్ మహారాజ్ రవితేజ కూడా ఓ ముఖ్యపాత్రలో కనిపించడంతో.. ఇటు మెగా.. అటు మాస్ మహారాజా ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. వసూళ్ల విషయానికొస్తే.. గతేడాది విడుదలైన చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ తొలిరోజు రూ.12.97 కోట్లు మాత్రమే వసూలు చేయగా.. వాల్తేరు వీరయ్య అన్ని భాషలు కలిపి.. రూ.29 కోట్లు రాబట్టడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాకు కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహించగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో శృతిహాసన్ నటించింది. రవితేజకు జోడీగా కేథరిన్ థ్రెసా నటించింది. వీరయ్య రాకతో.. వీరసింహారెడ్డి సెకండ్ డే వసూళ్లకు గండి పడింది. తొలిరోజు గురువారం రూ.33.6 కోట్లు రాబట్టిన వీరసింహారెడ్డి.. రెండోరోజు రూ.8.6కోట్లు మాత్రమే వసూలు చేసింది.
Next Story