Mon Dec 23 2024 14:52:53 GMT+0000 (Coordinated Universal Time)
వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ వచ్చేసింది..వీరసింహారెడ్డి VS వాల్తేరు వీరయ్య
తాజాగా.. సినిమా విడుదల తేదీని ప్రకటించింది మూవీ టీమ్. ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్రబృందం మొదటి నుండీ చెబుతోంది. ఇప్పటికే వచ్చిన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో బాస్ పార్టీ సాంగ్ ఎలాంటి బజ్ క్రియేట్ చేశాయో తెలిసిందే. డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో.. చిరంజీవి పక్కా ఊరమాస్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. వింటేజ్ చిరుని ఎప్పుడెప్పుడు చూస్తామా అని.. ఆడియన్స్ గా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
తాజాగా.. సినిమా విడుదల తేదీని ప్రకటించింది మూవీ టీమ్. ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే వీరయ్య కంటే ముందే.. తమిళ హీరో విజయ్ నటిస్తున్న 'వారిసు' చిత్రాన్ని తెలుగులో 'వారసుడు', బాలయ్య వీరసింహారెడ్డి ఒకరోజు ముందే.. అనగా జనవరి 12నే విడుదల కానున్నాయి. లేటైనా సరే.. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ కొడుతుందని, ఆ రెండు సినిమాలకు తమ మెగా హీరో గట్టిపోటీనిస్తాడని అంటున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Next Story