Sun Dec 22 2024 15:49:02 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి వాల్తేరు వీరయ్య.. ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అంటే..
రీ ఎంట్రీ తరువాత చిరంజీవి నుంచి మిస్ అవుతున్న కామెడీ టైమింగ్ ని ఈ సినిమాలో చూపించడంతో జనరల్..
తెలుగు ప్రేక్షకులను వాల్తేరు వీరయ్యగా వచ్చి తన వింటేజ్ లుక్స్ అండ్ యాక్షన్ కామెడీతో అలరించాడు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీ తరువాత చిరంజీవి నుంచి మిస్ అవుతున్న కామెడీ టైమింగ్ ని ఈ సినిమాలో చూపించడంతో జనరల్ ఆడియన్స్ కూడా థియేటర్లకు ఎగపడ్డారు. ఈ సినిమాతో చిరంజీవి రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. తనకున్న స్టామినా ఏంటో చూపించాడు. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ రవితేజ కూడా నటించాడు. చిరంజీవికి తమ్ముడిగా రవితేజ ఈ సినిమాలో కనిపించాడు.
సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ వద్ద పూనకాలు తెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్ నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ ప్రసారం కానుంది. ఫిబ్రవరి 27న నుంచి ఈ మూవీ ఓటిటిలో అందుబాటులోకి రాబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో పూనకాలు తెప్పించిన వాల్తేరు వీరయ్య ఓటీటీలో ప్రేక్షకుల్ని ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి.
Next Story