Sun Dec 22 2024 15:14:27 GMT+0000 (Coordinated Universal Time)
"వీరయ్య విజయ విహారం" సెలబ్రేషన్స్.. 10 రోజుల్లో రూ.200 కోట్లు
విడుదలైన 10 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్..
ఈ ఏడాది సంక్రాంతికి.. చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'వాల్తేరు వీరయ్య' విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. విడుదలైన 10 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేసింది. 'వీరయ్య విజయ విహారం' పేరుతో ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ను రేపు హనుమకొండలో నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు అక్కడి యూనివర్శిటీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం 6 గంటల నుండి ఈ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్, రవితేజ సరసన కేథరిన్ నటించగా.. ప్రతి నాయకుడి పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించాడు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో రామ్ చరణ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. దాంతో.. రేపు హనుమకొండలో మెగా సందడి కనిపించనుంది.
Next Story