Sun Dec 22 2024 20:49:15 GMT+0000 (Coordinated Universal Time)
నేడే వాల్తేరు వీరయ్య ట్రైలర్ లాంచ్.. ఆర్కే బీచ్ వద్దే ప్రీ రిలీజ్
రంజీవి బల్లెం పట్టుకుని బోటుపై నిలబడి.. ఉండగా.. వెనుక సముద్ర కెరటాలు ఎగసిపడుతున్నట్లు ..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మాస్ మహారాజా రవితేజ.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో డైరెక్టర్ బాబీ రూపొందించిన సినిమా వాల్తేరు వీరయ్య. ఇప్పటి వరకూ వచ్చిన పాటలు, గ్లింప్స్ లలో చిరంజీవిని.. వింటేజ్ చిరుగా చూపించడంతో.. ట్రైలర్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత చిరంజీవి కంప్లీట్ మాస్ హీరోగా కనిపించడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా పూనకాలు లోడింగ్ సాంగ్.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ట్రైలర్ విషయానికొస్తే.. ఈ రోజు సాయంత్రం 6.03 నిమిషాలకు ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.
ఈ సందర్భంగా వదిలిన పోస్టర్.. మరింత ఇంట్రస్టింగ్ గా కనిపిస్తోంది. చిరంజీవి బల్లెం పట్టుకుని బోటుపై నిలబడి.. ఉండగా.. వెనుక సముద్ర కెరటాలు ఎగసిపడుతున్నట్లు పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ ను చూసి అభిమానులు.. మాస్ మూలవిరాట్ వేట మొదలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమా విశాఖ బ్యాక్ డ్రాప్ లో తీసింది కావడంతో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్కడే నిర్వహించనున్నారు. రేపు (జనవరి 8)న ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరగనుంది. ప్రీ రిలీజ్ వేడుకను ఆర్కే బీచ్ వద్దే నిర్వహించనున్నారు. తొలుత ఆర్కే బీచ్ వద్దే ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. కానీ.. ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నంబర్ 1 కారణంగా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో ఆంధ్రా యూనివర్సిటీకి ఈవెంట్ ను మార్చారు. మళ్లీ పోలీసులు అనుమతి మంజూరు చేయడంతో.. ఆర్కే బీచ్ వద్దే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. శృతిహాసన్, రవితేజ, కేథరిన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.
Next Story