Sun Dec 22 2024 20:07:58 GMT+0000 (Coordinated Universal Time)
రికార్డ్స్ లో నా పేరుండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయ్.. వాల్తేరు వీరయ్య ట్రైలర్
"మీ కథలోకి నేను రాలా.. నా కథలోకి మీరంతా వచ్చారు" "వీడు నా ఎర, నువ్వే నా సొర"
మెగాఫ్యాన్స్తో పాటు.. సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య ట్రైలర్ వచ్చేసింది. చెప్పిన టైమ్ కు చిత్ర యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ట్రైలర్ ను చూస్తుంటే.. వింటేజ్ చిరుని చూస్తున్నట్లే అనిపిస్తుంది. చిరంజీవి డైలాగులు, రవితేజ - చిరంజీవి మధ్య సీన్స్.. చాలా బాగా చూపించారు. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. ‘‘మాస్ అనే పదానికి బొడ్డుకోసి పేరెట్టిందే ఆయన్ను చూసి..’’ అంటూ మెగాస్టార్ పాత్రను ఎలివేట్ చేసిన విధానం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది.
"అతనొక Monstar" అంటూ ట్రైలర్ స్టార్టింగ్ లో వినిపించే డైలాగ్స్.. సూపర్. చిరంజీవి ఒక డ్రగ్స్ స్మగ్లర్ గా కనిపించారు. "మీ కథలోకి నేను రాలా.. నా కథలోకి మీరంతా వచ్చారు" "వీడు నా ఎర, నువ్వే నా సొర" అని చిరంజీవి చెప్పిన డైలాగులు పూనకాలు తెప్పిస్తాయి. రవితేజ ఎంట్రీ అదిరిపోయింది. "వైజాగ్ లో గట్టి ఏటగాడు లేడని ఒక పులి పూనకాలతో ఊగుతోందట" అని మాస్ మహారాజా చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. పోలీస్ స్టేషన్ లో.. చిరంజీవి - రవితేజల మధ్య డైలాగ్స్ పేలాయి. ఇడియట్ సినిమాలో రవితేజ చెప్పిన కమిషనర్ డైలాగ్.. ఇక్కడ చిరంజీవి చేత చెప్పించారు. "సిటీకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు.. వాల్తేరు వీరయ్య లోకల్" అన్న డైలాగ్ కు విజిల్స్ ఖాయం. ట్రైలర్ రిలీజ్ అయిన అరగంటలోనే.. 1 మిలియన్ వ్యూస్ తో వాల్తేరు వీరయ్య రికార్డులు మొదలయ్యాయి. శృతిహాసన్, కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, సత్యరాజ్, ప్రభాస్ శ్రీను, ప్రకాష్ రాజ్ తదితర నటీనటులతో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించిన వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
Next Story