Mon Dec 23 2024 11:09:39 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్, హృతిక్ డూపులతో 'వార్ 2' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్..
ఎన్టీఆర్, హృతిక్ లేకుండా వాళ్ళ డూపులతో 'వార్ 2' ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసేసిన దర్శకుడు.
ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిలిమ్స్ ఒకటి 'వార్ 2'. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ఈ సినిమా యశ్ రాజ్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతుంది. 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ లోకి ఎన్టీఆర్ అడుగుపెడతాడా..? అని ఎదురు చూస్తున్నారు.
కాగా ఈ మూవీ షూటింగ్ ని ఇటీవల స్పెయిన్ లో ఎన్టీఆర్, హృతిక్ లేకుండానే మొదలు పెట్టేశాడు దర్శకుడు. హీరోలు లేకుండా షూటింగ్ ని స్టార్ట్ చేయడమే కాదు, కంప్లీట్ కూడా చేసేశాడు. స్పెయిన్ లో జరిగిన ఈ యాక్షన్ షెడ్యూల్ లో అదిరిపోయే కారు ఛేజింగ్ సీక్వెన్స్ ని దర్శకుడు అయాన్ చిత్రీకరించాడు. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ మొత్తాన్ని ఎన్టీఆర్, హృతిక్ డూపులతో పూర్తి చేసేశారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
మొదటి షెడ్యూల్ ని హీరోలు లేకుండానే పూర్తి చేసేసిన దర్శకుడు.. సెకండ్ షెడ్యూల్ లో అయినా హీరోలతో షూటింగ్ చేస్తాడా..? లేదా డూపులతోనే చేస్తాడా..? అనే కామెంట్స్ నెట్టింట వినిపిస్తున్నాయి. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. దీంతో వార్ 2 సెట్స్ లోకి ఎన్టీఆర్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే దానిపై సందేహం నెలకుంది. అలాగే ఎన్టీఆర్ ఈ మూవీలో ఎలాంటి పాత్రని పోషిస్తున్నాడు..? అనేది కూడా తెలియాల్సి ఉంది.
వార్ 1 మూవీలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ఇద్దరు హీరోలుగా నటించారు. ఇప్పుడు ఈ సీక్వెల్ లో ఎన్టీఆర్ విలన్ రోల్ చేస్తున్నాడని గతంలో వార్తలు వినిపించాయి. ఇకఈ మూవీలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ని వచ్చే ఏడాది సమ్మర్ లోపు పూర్తి చేసేలా దర్శకుడు ప్లాన్ చేశాడని తెలుస్తుంది.
Next Story