Mon Dec 23 2024 10:56:33 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. బాలీవుడ్ మూవీలో చేస్తున్న రోల్ అదే!!
బాలీవుడ్ లో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న యశ్ రాజ్ ఫిలిమ్స్
బాలీవుడ్ లో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న యశ్ రాజ్ ఫిలిమ్స్ 'స్పై యూనివర్స్' లోకి నందమూరి తారకరామారావు భాగమవుతూ ఉన్నారు. హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్‌తో మొదటిసారిగా.. ఒక సౌత్ ఇండియన్ స్టార్ YRF స్పై యూనివర్స్ లో చేరారు. ఎన్టీఆర్ వార్-2 లో కీలక పాత్ర చేయబోతూ ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభం కాగా.. హృతిక్ రోషన్ ఈ వారం సెట్స్‌లోకి జాయిన్ అయ్యాడు. హృతిక్.. యాక్షన్-ఇంట్రడక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ఎన్టీఆర్ వార్ 2 సెట్స్‌లో జాయిన్ అవ్వనున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇండియన్ రా ఏజెంట్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
హృతిక్, ఎన్టీఆర్ వార్-2 లో భాగంగా ఉండటంతో.. అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రం 2025 లో విడుదల కానుంది. YRF స్పై సిరీస్‌లో అలియా భట్‌పై ఓ చిత్రం, షారుఖ్ ఖాన్‌తో పఠాన్ సీక్వెల్ తెరకెక్కించనున్నారు. అన్ని స్పై సిరీస్ చిత్రాల మాదిరిగానే.. ప్రతి చిత్రంలో కూడా చాలా మంది అతిధి పాత్రలను పోషిస్తూ ఉన్నారు. వార్ 2తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 లో కూడా ఎన్టీఆర్ చేస్తున్నాడు.
Next Story