Mon Dec 23 2024 03:17:35 GMT+0000 (Coordinated Universal Time)
NTR : 'టైగర్ 3'లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారా..?
సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారా..? బాలీవుడ్ క్రిటిక్ కెఆర్కె ఈ విషయం గురించి..
Tiger 3 - NTR : ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఎంతటి పాపులారిటీని సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ పాపులారిటీ బాలీవుడ్ తమ సినిమాల కోసం ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. ఈక్రమంలోనే తమ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కోసం ఎన్టీఆర్ ని సంప్రదిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ 'వార్ 2' సినిమాకి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీ పై నేషనల్ వైడ్ భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమాకంటే ముందు ఎన్టీఆర్ మరో మూవీలో కనిపించబోతున్నాడట. సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'టైగర్ 3' ఈ దీపావళికి రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతుంది. వార్ 2 సినిమా కూడా ఈ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే రాబోతుంది. దీంతో ఎన్టీఆర్ పాత్రని టైగర్ 3 లోనే పరిచయం చేసేలా డిజైన్ చేసారని సమాచారం.
టైగర్ 3లో 'పఠాన్'గా షారుఖ్ ఎంట్రీ ఉండబోతుందంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే షారుఖ్ తో పాటు వార్ మూవీ నుంచి 'మేజర్ కబీర్ ధలీవాల్'గా హృతిక్, అలాగే ఎన్టీఆర్ కూడా టైగర్ 3లో కనిపించబోతున్నారట. బాలీవుడ్ క్రిటిక్ కెఆర్కె కూడా ఈ విషయం గురించి పదే పదే ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో టైగర్ 3లో హృతిక్, ఎన్టీఆర్ ఎంట్రీ నిజంగానే ఉండబోతుందా అనే సందేహం మొదలైంది.
టైగర్ మూవీ సిరీస్ కి సౌత్ లో పెద్ద ఆదరణ లేదు. ఇప్పుడు టైగర్ 3కి కూడా ఇక్కడ పెద్ద ఆసక్తి కనిపించడం లేదు. ఒకవేళ ఎన్టీఆర్ ఉంటే గనుక సౌత్ లో టైగర్ 3కి మంచి బజ్ క్రియేట్ అవుతుంది. మూవీ టీం ఆలోచన కూడా అయ్యిండొచ్చు. మరి టైగర్ 3లో ఎన్టీఆర్ ఉన్నాడా లేదా తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే. మనీష్ శర్మ దర్శకత్వంలో కత్రినాకైఫ్ హీరోయిన్గా, ఇమ్రాన్ హష్మీ విలన్గా తెరకెక్కిన టైగర్ 3 నవంబర్ 12న రిలీజ్ అవుతుంది.
Next Story