Mon Dec 23 2024 07:17:49 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి వచ్చేసిన మేజర్.. చూడాలని ఉందా..?
మేజర్ సినిమా.. భారతదేశంలోని ముంబైలో 2008 తాజ్ ప్యాలెస్ హోటల్ దాడి సమయంలో విధి నిర్వహణలో మరణించిన
యువ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం 'మేజర్'. ముంబై దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచిత పోరాటం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ నటించాడు. తెలుగు, హిందీతో పాటు విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'నెట్ ఫ్లిక్స్'లో ఈ చిత్రం ఆదివారం నుంచి స్ట్రీమ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, మలయాళంతో పాటు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి ఇతర కీలక పాత్రలలో కనిపించారు. సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ స్టూడియోస్ తో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాను నిర్మించాడు. జూన్ 3వ తేదీన రిలీజైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ అలరించనుంది.
మేజర్ సినిమా.. భారతదేశంలోని ముంబైలో 2008 తాజ్ ప్యాలెస్ హోటల్ దాడి సమయంలో విధి నిర్వహణలో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కెరీర్ గురించి చూపించింది. జూన్ 3న విడుదలైన మేజర్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా వారంలోపే రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది.
Next Story