Mon Dec 23 2024 11:19:59 GMT+0000 (Coordinated Universal Time)
ఓ వైపు కల్కి సినిమా-మరో వైపు వర్షం.. థియేటర్ సిబ్బంది ఓవరాక్షన్
భారీ వర్షం కారణంగా ఆదివారం రాత్రి పంజాగుట్టలోని ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్
భారీ వర్షం కారణంగా ఆదివారం రాత్రి పంజాగుట్టలోని ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్ పైకప్పు నుంచి నీరు లీకైంది. ప్రేక్షకులు కల్కి 2898 ADని చూస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. స్క్రీనింగ్ పాజ్ చేసిన తర్వాత ప్రేక్షకులు థియేటర్ సిబ్బందితో గొడవకు దిగారు. షార్ట్‌సర్క్యూట్, అవాంఛనీయ ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రేక్షకులు ప్రశ్నించారు. థియేటర్ సిబ్బంది ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. చూస్తే చూడండి లేకపోతే వెళ్లిపోండి అన్నట్లుగా సమాధానం చెప్పారు.
సినిమా చూడటం ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని థియేటర్ యాజమాన్యం కోరడంతో, ప్రేక్షకులు పోలీసులను సంప్రదించారు. వర్షం కురుస్తున్న కూడా థియేటర్ యాజమాన్యం మాత్రం సినిమాని నిలిపివేయలేదని ప్రేక్షకులు వాపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఓ వైపు కొన్ని సీట్ల మీద వర్షపు నీరు కురుస్తూ ఉండగా.. మరికొందరు సినిమా చూస్తూ ఉన్నారు.
Next Story