Mon Dec 23 2024 05:51:30 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ వేదికపై సమంత గురించి అడిగిన నాగార్జున
విజయ్ దేవరకొండ, సమంతా రూత్ ప్రభు నటించిన 'ఖుషి' సినిమా
విజయ్ దేవరకొండ, సమంతా రూత్ ప్రభు నటించిన 'ఖుషి' సినిమా సెప్టెంబర్ 1, 2023న థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన వెంటనే, ఖుషి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజున రూ. 16 కోట్లు వసూలు చేసింది. విజయ్ దేవరకొండ సినిమాను ప్రమోట్ చేయడానికి చాలానే కష్టపడుతూ ఉన్నాడు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ రియాలిటీ షో, బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కూడా కనిపించాడు. సెప్టెంబర్ 3 తెలుగులో బిగ్ బాస్ ఏడవ సీజన్ ప్రారంభమైంది.
షో సందర్భంగా, హోస్ట్ అక్కినేని నాగార్జున.. విజయ్ని ఖుషి సినిమా విశేషాలు అడగడమే కాకుండా.. నాగార్జున మాజీ కోడలు సమంతా రూత్ ప్రభు గురించి కూడా అడిగారు. నాగార్జున-విజయ్ల మధ్య ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కినేని నాగార్జున కుమారుడు నాగ చైతన్య, నటి సమంతా రూత్ ప్రభు ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..! అయితే కొన్ని కారణాల వల్ల నాగ చైతన్య , సమంత విడిపోయారు. 2 అక్టోబర్ 2021న విడిపోతున్నట్లు ప్రకటనను విడుదల చేశారు. ఖుషి సినిమా ప్రమోషన్స్ కు విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు హీరోయిన్ సమంత రాలేదు. దీంతో మీ హీరోయిన్ ఎక్కడ అని అడిగారు నాగార్జున. సమంత ఎందుకు రాలేకపోయిందో విజయ్ దేవరకొండ కారణం చెప్పడంతో ఆ తర్వాత వేరే విషయాల గురించి చర్చించుకున్నారు.
Next Story