Mon Dec 23 2024 08:59:19 GMT+0000 (Coordinated Universal Time)
మెగాస్టార్ - సూపర్ స్టార్ ప్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్.. వామ్మో ఇలా తిట్టుకుంటున్నారేంటి ?
తెలుగురాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ.36.63 కోట్ల షేర్ రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు వసూలు చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ..
హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారువారి పాట సినిమా మే 12వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజు షోలు పూర్తయ్యాక సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కొందరు సినిమా బాగుందని చెప్తుండగా.. మరికొందరు ప్రేక్షకులు మహేష్ ఇలా నిరాశపరుస్తాడని అనుకోలేదు అంటూ.. సినిమా హిట్ టాక్ పై పెదవి విరుస్తున్నారు. కానీ.. సినిమాలో కొన్ని సీన్లు అభిమానులను మెప్పించేలా ఉండటం, మహేష్ లుక్, కీర్తి-మహేష్ ల కెమిస్ట్రీకి కలెక్షన్లు వస్తున్నాయి.
తెలుగురాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ.36.63 కోట్ల షేర్ రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు వసూలు చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ.. సర్కారువారిపాట వసూళ్లు మెగా-సూపర్ స్టార్ అభిమానుల మధ్య చిచ్చుతెచ్చి పెడుతోంది. SVP ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్ టైమ్ రికార్డని చిత్రయూనిట్, మహేష్ ఫ్యాన్స్ ప్రకటించడాన్ని మెగా అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంటూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ కూడా ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు.
ఒకరకంగా ట్విట్టర్లో కంటికి కనిపించని యుద్ధం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. మెగాస్టార్ - సూపర్ స్టార్ అభిమానుల మధ్య బూతుల యుద్ధం జరుగుతోంది. SVP ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.75 కోట్లు వచ్చిందని ప్రకటించడం అబద్ధమని మెగా ఫ్యాన్స్ #SVPFakeCollections ట్యాగ్ తో ట్వీట్ చేస్తే.. ఆచార్య కంటే సర్కారు వారి పాటనే తొలి రోజు ఎక్కువ కలెక్షన్లు సాధించిందని వాదిస్తున్న మహేష్ ఫ్యాన్స్.. #MegaFamilyRankuMogudu అంటూ కౌంటర్ ట్వీట్లతో దుమారం రేపుతున్నారు. ఈ ఫ్యాన్స్ వార్ పై ఆ హీరోలు స్పందిస్తారో లేదో చూడాలి.
Next Story