ఎందుకీ మౌనం.. ఏమిటి సహనం!!
ప్రస్తుతం కరోనా కన్నా పెద్ద హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే.. అది ఎన్టీఆర్ ఫాన్స్ కి నటి మీరా చోప్రా కి మధ్యన జరుగుతున్నా సోషల్ [more]
ప్రస్తుతం కరోనా కన్నా పెద్ద హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే.. అది ఎన్టీఆర్ ఫాన్స్ కి నటి మీరా చోప్రా కి మధ్యన జరుగుతున్నా సోషల్ [more]
ప్రస్తుతం కరోనా కన్నా పెద్ద హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే.. అది ఎన్టీఆర్ ఫాన్స్ కి నటి మీరా చోప్రా కి మధ్యన జరుగుతున్నా సోషల్ మీడియా యుద్ధం. మాజీ హీరోయిన్ మీరా చోప్రా ఎన్టీఆర్ అంటే నాకిష్టం లేదు.. నేను ఆయన అభిమానిని కాదు అన్నందుకు గాను.. ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది మీరా చోప్రా కి సోషల్ మీడియాలోనే చుక్కలు చూపెడుతున్నారు. మీరా చోప్రా పోలీస్ లకు ఫిర్యాదు చెయ్యడమే కాదు… తెలంగాణ మంత్రి కేటీఆర్ కి కూడా ట్విట్టర్ నుండి మెస్సేజ్ పెట్టింది. అయితే మీరా చోప్రా కి వ్యతిరేఖంగా ఎన్టీఆర్ అభిమానులకు తమిళ నటి ఖుష్బూ మద్దతు పలకడం… తాజాగా నటి పూనమ్ కౌర్ కూడా ఎన్టీఆర్ కి సపోర్ట్ గా మీరా కి కౌంటర్ వేయ్యడం,.. ఇలా సోషల్ మీడియా వ్యాప్తంగా రాద్ధాంతం జరుగుతుంది.
ఇంతజరుగుతున్నా ఎన్టీఆర్ మాత్రం మౌనం పాటిస్తున్నారు. కానీ అభిమానులకు ఓ సందేశం ఇవ్వడం లేదు. అభిమానులే తన బలం, వారికీ సదా రుణపడి ఉంటా అంటూ ఎప్పుడు చెప్పే ఎన్టీఆర్ ఇప్పుడు ఇలా మౌనం గా ఉండడం చూస్తే మాత్రం.. ఎందుకు ఎన్టీఆర్ ఇలా చేస్తున్నాడనిపిస్తుంది. మరోపక్క మీరా చోప్రా ఎన్టీఆర్ ని టాగ్ చేస్తూ ఎన్టీఆర్ స్పందించాలని, అభిమానులను కంట్రోల్ లో పెట్టుకోవాలంటూ ట్వీట్ చేసింది. అయినా ఎన్టీఆర్ సైలెన్స్ నే మైంటైన్ చేస్తున్నాడు. మరోపక్క ఎన్టీఆర్ తన అభిమానుల విషయంలో మనస్తాపానికి లోనయ్యాడని.. ఇంత హాట్ గా ఉన్న టైం లో ఎన్టీఆర్ చెప్పినా అభిమానులు వినరనే ఉద్దేశ్యంతోనే మౌనంగా ఉన్నాడని చెబుతున్నారు.