Fri Dec 20 2024 04:16:15 GMT+0000 (Coordinated Universal Time)
New Web Series : ఇప్పుడు పెద్ద హీరోలు కూడా వెబ్సిరీస్ల వెంటే.. కాలం మారింది మామా
సినిమాల్లో వరుస అవకాశాలు అందుకున్నప్పటికీ.. స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్ వైపు ఎందుకు మక్కువ చూపిస్తున్నారు..?
New Web Series : కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రజలకు మాస్క్ ఎలా అలవాటు అయ్యిందో.. వెబ్ సిరీస్ కూడా అలాగే అలవాటు అయ్యాయి. లాక్ డౌన్ సమయంలో ఇంటిలోనే కూర్చున్న ప్రజలంతా.. ఓటీటీలో ఉన్న వెబ్ సిరీస్ చూసి వాటికీ ఆకర్షితులు అయ్యారు. ఇక ఆడియన్స్ కి వెబ్ సిరీస్ పై పెరిగిన ఇంటరెస్ట్ ని గమనించిన ఇండియన్ మేకర్స్.. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈక్రమంలోనే స్టార్ హీరోహీరోయిన్స్ సైతం వెబ్ సిరీస్ లో నటించేందుకు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. వెంకటేష్, రానా, విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్, అజయ్ దేవగన్, సమంత, రాశి ఖన్నా.. ఇలా ప్రతి ఒక్కరు వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. సినిమాల్లో వరుస అవకాశాలు అందుకున్నప్పటికీ.. ఈ స్టార్స్ అంతా వెబ్ సిరీస్ వైపు ఎందుకు మక్కువ చూపిస్తున్నారు..? దానికి కూడా వారే సమాధానం చెబుతున్నారు.
ఒక హీరో నుంచి ఒక సినిమా వస్తుందంటే.. ఆడియన్స్ లో కొన్ని అంచనాలు ఉంటాయి. వాటికీ తగ్గట్టు ఆ స్టార్స్ కూడా సినిమాలు చేయాల్సి వస్తుంది. అలా కాదని కొత్తగా ప్రయత్నం చేస్తుంటే.. కొన్నిసార్లు సక్సెస్ అయినప్పటికీ, చాలా వరకు నిర్మాతలకు నష్టం కలిగిస్తుంది. దీంతో వెండితెర పై ప్రయోగాలు చేయడానికి చాలావరకు భయపడుతున్నారు. అయితే ఓటీటీకి వచ్చేసరికి అలా కాదు.
ఓటీటీ ఆడియన్స్ అక్కడ ప్రయోగాత్మక ఫిలిమ్స్ నే కోరుకుంటున్నారు. దీంతో ప్రయోగాలు చేయాలన్న స్టార్స్ కోరిక కూడా ఓటీటీ వల్ల నెరవేరుతుంది. ఈక్రమంలోనే తాజాగా అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య కూడా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టారు. 'దూత' అనే ఒక సూపర్ నేచురల్ క్రైమ్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో చైతన్య జర్నలిస్ట్ గా కనిపించబోతున్నారు.
తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. సిరీస్ పై ఆసక్తిని కలుగజేసింది. అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 1 నుంచి ఈ సిరీస్ ప్రసారం కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సిరీస్ స్ట్రీమ్ అవ్వనుంది. మరి ఈ సిరీస్ తో నాగచైతన్య ఆడియన్స్ ని ఆకట్టుకుంటారా..? లేదా..? చూడాలి.
Next Story