విజయ్ కు అటువంటి ఆలోచనలు ఎందుకు వచ్చాయి..?
హీరో విజయ్ దేవరకొండ కు ఓ కొత్త ఆలోచన వచ్చింది. హీరో గా సినిమాలతో బిజీగా తన లైఫ్ ని లీడ్ చేస్తున్న విజయ్ ఓ ఇంటర్వ్యూ [more]
హీరో విజయ్ దేవరకొండ కు ఓ కొత్త ఆలోచన వచ్చింది. హీరో గా సినిమాలతో బిజీగా తన లైఫ్ ని లీడ్ చేస్తున్న విజయ్ ఓ ఇంటర్వ్యూ [more]
హీరో విజయ్ దేవరకొండ కు ఓ కొత్త ఆలోచన వచ్చింది. హీరో గా సినిమాలతో బిజీగా తన లైఫ్ ని లీడ్ చేస్తున్న విజయ్ ఓ ఇంటర్వ్యూ లో ఛెఫ్ అయి వంటలు చేస్తే ఎలా ఉంటుందా, గన్ పట్టుకుని ఆర్మీలో చేరిపోతే ఎలా ఉంటుందో, లేదా కార్/బైక్ రేసింగ్ లోకి వెళ్తే ఎలా ఉంటుందా అంటూ ఆలోచనలు సాగుతున్నాయని చెప్పాడు.
మరి విజయ్ కు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో ఏంటో…తన సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడడంలేదు కనుక ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయో ఏమో కానీ ఇవన్నీ ఇప్పుడు ఆలోచించట్లేదని కొన్ని రోజులు నుండి బ్రెయిన్ ఆఫ్ చేసేసి ఏమీ ఆలోచించలేదని చెప్పాడు.
సినిమాలతో బిజీగా ఉండడంతో గత రెండేళ్ల నుండి కంటి నిండా నిద్ర పోలేదని, ఇప్పుడు దాన్ని బాలన్స్ చేస్తున్నాని, రోజుకి కనీసం 10 గంటలు పడుకున్న తనను అడిగే వాళ్లు లేరని చెప్పాడు.