బిగ్ బాస్ 3 మొదలవడం కష్టమే సుమీ!
మరో ఐదు రోజుల్లో గ్రాండ్ గా నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 మొదలు కాబోతుంది. ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ షో క్రికెట్ [more]
మరో ఐదు రోజుల్లో గ్రాండ్ గా నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 మొదలు కాబోతుంది. ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ షో క్రికెట్ [more]
మరో ఐదు రోజుల్లో గ్రాండ్ గా నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 మొదలు కాబోతుంది. ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ షో క్రికెట్ వరల్డ్ కప్ కారణంగా కాస్త ఆలస్యంగా మొదలవుతుంది. ఇక బిగ్ బాస్ 3 అనుకున్నప్పటినుండి ఆ షో పై ఏదో ఒకరకంగా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. నాగార్జున హోస్ట్ అనగానే… అదిగో నాగార్జున బిగ్ బాస్ ని గతంలో విమర్శించాడు.. కానీ ఇప్పుడు డబ్బు కోసం ఆశపడి ఈ షో కి హోస్ట్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. ఇక తాజాగా బిగ్ బాస్ 3 మీద క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
స్టార్ మా యాజమాన్యం నాగార్జున వ్యాఖ్యాతగా బిగ్ బాస్ 3 ని గ్రాండ్ గా మొదలెట్టాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్న టైం లో కొంతమంది సెలబ్రిటీస్ తమని బిగ్ బాస్ నిర్వహకులు నానారకాలుగా ఇష్టం వచ్చినట్లుగా మట్లాడారని.. తమని సెలెక్ట్ చేసి అడగకూడని ప్రశ్నలు అడిగారని. బిగ్ బాస్ ని మీరు ఏ విధంగా శాటిస్ఫాయ్ చేయగలరని అసభ్యంగా మట్లాడారని.. యాంకర్ శ్వేతా రెడ్డి, నటి యత్రి గుప్త బిగ్ బాస్ నిర్వాహకులైన వ్యక్తులపై ఆరోపణలు చేస్తున్నారు. మరి షో మొదల్యయే టైం లో అలాంటి ఆరోపణలతో బిగ్ బాస్ మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ మొదలైన టైం పడుతోందనే న్యూస్ ప్రచారంలోకొచ్చింది. మరి ఎప్పుడూ కాంట్రవర్సీలకు దూరంగా ఉండే నాగార్జున.. ఇప్పుడు బిగ్ బాస్ మొదలవ్వకముందే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 2 అప్పుడు నాని ఎలా నలిగిపోయాడో చూసాం. ఇప్పుడు నాగ్ వంతు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి