Tue Dec 24 2024 02:14:11 GMT+0000 (Coordinated Universal Time)
యాంకరింగ్ మానేస్తోన్న సుమ ? ఇంతకీ ఆమె ఏం చెప్పింది ?
నేడు తెలుగు రాష్ట్రాల్లో జయమ్మ పంచాయితీ సినిమా విడుదల సందర్భంగా.. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..
హైదరాబాద్ : బుల్లితెరపై తన మాటలతో గారడీ చేస్తూ.. ఎందరో అభిమానులను సంపాదించుకున్న యాంకర్ సుమ కనకాల. యాంకర్ గా సూపర్ సక్సెస్ అయిన సుమ.. ఇప్పుడు జయమ్మ పంచాయితీ సినిమాతో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. విజయ్ కుమార్ కాలివరపు తెరకెక్కించిన ఈ సినిమాను వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై బలగ ప్రకాశ్ నిర్మించగా.. ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చారు.
నేడు తెలుగు రాష్ట్రాల్లో జయమ్మ పంచాయితీ సినిమా విడుదల సందర్భంగా.. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా తర్వాత యాంకరింగ్ మానేస్తున్నారా ? అన్న ప్రశ్నకు సుమ సమాధానమిచ్చింది. బుల్లితెరను వదిలే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. బుల్లితెరపై ఉంటూనే.. మంచి పాత్రలు వస్తే.. సినిమాల్లో నటిస్తానని చెప్పుకొచ్చింది సుమ. బుల్లితెర తన తల్లిలాంటిదన్న సుమ.. దానిని వదిలి వెళ్లబోనని తెలిపింది. టీవీల్లో చేస్తూ సినిమాలకు వెళ్తున్నాను కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నారని, కానీ, చాలా మంది సినిమాలు చేస్తూ టీవీలోకి వస్తున్నారని చెప్పింది.
Next Story