Mon Dec 23 2024 09:03:55 GMT+0000 (Coordinated Universal Time)
ఓవర్సీస్ లో రైటర్ పద్మభూషణ్ హవా
క్యారెక్టర్ ఆర్టిస్టుల నుండి హీరోలుగా మారి కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా మలచుకోవడంలో అంత సులువు కాదు. చాలామంది విఫలమవ్వగా..
టాలీవుడ్ కి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమై.. ఆ తర్వాత హీరోగా, విలన్ గా వరుస సక్సెస్ లతో రాణిస్తోన్న నటుడు సుహాస్. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుండి హీరోలుగా మారి కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా మలచుకోవడంలో అంత సులువు కాదు. చాలామంది విఫలమవ్వగా.. సక్సెస్ అయినవారు చాలా తక్కువే. అలా సక్సెస్ అయిన వారిలో సుహాస్ ఒకడు. ‘కలర్‌ఫోటో’ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన సుహాస్.. అనూహ్యంగా హిట్-2 మూవీలో నెగెటివ్ రోల్లోనూ నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు.
తాజాగా ‘రైటర్ పద్మభూషణ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. ఇక ఫీల్‌గుడ్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకాదరణ పెరుగుతుండటంతో ఈ సినిమా వసూళ్ల పరంగానూ మంచి నెంబర్లు నమోదు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకూ అక్కడ 250కె డాలర్లు.. అంటే మన కరెన్సీలో రెండుకోట్లకు పైగానే (రూ.2,06,37,712). ఇక్కడ తొలివారం పూర్తయ్యే సరికి రైటర్ పద్మభూషణ్ రూ.5 కోట్ల షేర్ రాబట్టగా.. ఈరోజు తెలుగురాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఆడవాళ్లకి నాలుగు షో లు ఫ్రీగా చూపించారు.
Next Story