Sun Jan 12 2025 11:47:15 GMT+0000 (Coordinated Universal Time)
రైటర్ పద్మభూషణ్.. రేపు ఆడవాళ్లకు ఫ్రీ షోస్
కెరీర్ మొదలైంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అయినా.. కలర్ ఫొటోతో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల వచ్చిన హిట్ 2..
యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలింస్ తో ఫేమస్ అయి.. ఇండస్ట్రీలోకి కలర్ ఫొటోతో హీరోగా అడుగుపెట్టిన సుహాస్.. వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నాడు. కెరీర్ మొదలైంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అయినా.. కలర్ ఫొటోతో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల వచ్చిన హిట్ 2 లో విలన్ గానూ నటించి మెప్పించిన సుహాస్.. తాజాగా మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ‘రైటర్ పద్మభూషణ్’ ఫిబ్రవరి 3న రిలీజ్ అయ్యింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. తొలివీకెండ్ పూర్తయ్యేసరికి రూ.5.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమాను చూసి చిత్రబృందాన్ని అభినందించారు. ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే తాజాగా చిత్రయూనిట్ ఆడియన్స్ కి బంపరాఫర్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆడవారికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి, వాటికీ కూడా గౌరవం ఇవ్వాలి అనే పాయింట్ ని చూపించారు. ఆ గౌరవంతోనే ఈ మూవీని ఫ్రీగా చూసేందుకు మూవీ టీం ఆడవాళ్లకి అవకాశం కల్పిస్తుంది. ఈ బుధవారం అనగా ఫిబ్రవరి 8న ఏపీ, తెలంగాణలోని కొన్ని సెంటర్స్ లో ఆడవాళ్ళకి నాలుగు షోలు ఫ్రీగా వేసేలా చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 38 థియేటర్లలో ఈ అవకాశం అందుబాటులో ఉంది.
Next Story