Mon Dec 23 2024 19:59:48 GMT+0000 (Coordinated Universal Time)
RRR సీక్వెల్ ఉండొచ్చు : విజయేంద్ర ప్రసాద్
RRR బిగ్గెస్ట్ హిట్ కావడంతో.. సినిమా బృందమంతా ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సక్సెస్ స్టోరీల వెనుక..
హైదరాబాద్ : టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి.. బాహుబలితోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరొందారు. బాహుబలి, బాహుబలి 2, ఇప్పుడు RRR. రాజమౌళి ఏ సినిమా తీసినా పాన్ ఇండియా లెవల్ లో హిట్ అవుతున్నాయి. RRR బిగ్గెస్ట్ హిట్ కావడంతో.. సినిమా బృందమంతా ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సక్సెస్ స్టోరీల వెనుక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ హస్తం ఉంది. అద్భుతమైన కథలను రాయడంలో ఆయనకు ఆయనే సాటి. RRR సినిమాకు ఆయనే కథ అందించారు.
కాగా.. RRRకు సీక్వెల్ వస్తుందా ? అని ఇప్పుడు అందరిలోనూ మెదులుతోన్న ప్రశ్న. ఈ విషయంపై విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. దేవుడి దయ ఉంటే సీక్వెల్ రావచ్చని చెప్పారు. గతరాత్రి దిల్ రాజ్ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఇచ్చిన RRR సక్సెస్ పార్టీలో సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. RRR సీక్వెల్ ఉంటుందని, త్వరలోనే కథను సిద్ధం చేయబోతున్నట్లు చెప్పారు. ఇంకేముంది.. తారక్-చరణ్ ల అభిమానులు ఫుల్ ఖుషీ.
Next Story