Mon Dec 23 2024 04:49:06 GMT+0000 (Coordinated Universal Time)
John Cena : ఆస్కార్ వేదికపై నగ్నంగా జాన్‌సీన..వీడియో వైరల్..
నేడు లాస్ ఏంజిల్స్ లో జరిగిన 96వ ఆస్కార్ వేడుకల్లో WWE రెజ్లర్ 'జాన్‌సీన'.. వేదిక పైకి నగ్నంగా వచ్చి షాక్‌కి గురిచేసారు.
John Cena : WWE రెజ్లర్ 'జాన్‌సీన' గురించి ఇండియన్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు చాలామంది తమ చిన్నతనంలో అతని రెజ్లింగ్ షోలు చూస్తూ పెరిగిన వారే. జాన్‌సీన కేవలం రెజ్లర్ గానే కాదు, యాక్టర్ గా కూడా పలు హాలీవుడ్ సినిమాల్లో నటించి అలరించారు. దీంతో ఈ రెజ్లర్ కమ్ యాక్టర్ కి ఇండియాలో కూడా మంచి ఫ్యాన్డమ్ ఉంది. కాగా ఈ నటుడు నేడు లాస్ ఏంజిల్స్ లో జరిగిన 96వ ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే అక్కడ వేదిక పైకి నగ్నంగా వచ్చి అందర్నీ షాక్ కి గురి చేసారు.
అసలు ఏమైందంటే.. జాన్సీనని బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డుని ప్రకటించేందుకు వేదిక పైకి ఆహ్వానించారు. ఇక అవార్డు ప్రకటించేందుకు జాన్‌సీన.. ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా ఎంట్రీ ఇచ్చారు. కేవలం తన ప్రైవేట్ పార్ట్ కి ఒక అట్టముక్క అడ్డుపెట్టుకొని స్టేజి పైకి వచ్చారు. ఈ బోల్డ్ ఎంట్రీ చూసినవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే జాన్‌సీన మైక్ దగ్గరకి వచ్చి.. 'అందుకే కాస్ట్యూమ్స్ అనేవి ముఖ్యం అనేది' అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ నవ్వేశారు. ఇక ఆ మాట తరువాత ఆస్కార్ నిర్వహులు వెంటనే కొన్ని బట్టలు తీసుకు వచ్చి.. స్టేజి పైనే జాన్సీనకి తొడిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా ఈ ఏడాది బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డుని 'పూర్ థింగ్స్' చిత్రం నుంచి 'హోలి వెడ్డింగ్టన్' గెలుచుకున్నారు. ఇక ఈసారి పురస్కారంలో ఎక్కువ ఆస్కార్లు అందుకున్న సినిమాలుగా.. ఓపెన్ హైమర్, పూర్ థింగ్స్ చిత్రాలు నిలిచాయి. ఓపెన్ హైమర్ 7 క్యాటగిరీల్లో, పూర్ థింగ్స్ 4 క్యాటగిరీల్లో ఆస్కార్ ని సొంతం చేసుకున్నాయి.
Next Story