Mon Dec 23 2024 03:16:05 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : సలార్ ట్రైలర్లో యశ్..! మీరు గమనించారా..?
సలార్ సెకండ్ ట్రైలర్లో యశ్ కనిపించాడా..? ఆ సీన్ ని మీరు గమనించారా..?
Salaar : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన ప్రధాన పాత్రల్లో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న మూవీ 'సలార్'. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ చిత్రం పై భారీ హైప్ నెలకుంది. మొదటి భాగం 'సీజ్ ఫైర్'ని డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక సాంగ్, ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో ట్రైలర్ ని యాక్షన్ కట్ తో రిలీజ్ చేశారు.
మొదటి ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ కట్ తో రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులకు కన్నులు విందు అయ్యింది. ఈ ట్రైలర్ చూసిన వారంతా.. ఈ చిత్రాన్ని ఎప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీని మరింత రెట్టింపు చేసింది. ఇది ఇలా ఉంటే, ఈ ట్రైలర్ చూసిన కొంత మంది ఒక విషయాన్ని గమనించారు. ట్రైలర్ బ్యాక్ షాట్ నుంచి ఒక వ్యక్తిని చూపించారు.
ఆ వ్యక్తి హీరో యశ్ లా ఉన్నాడు. కేజీఎఫ్ మూవీలోని యశ్ బ్యాక్ షాట్ ని చూపిస్తూ.. ఈ ట్రైలర్ లోని షాట్ ని కంపేర్ చేస్తూ సేమ్ కట్ అవుట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ పోస్టులు చూసిన ఆడియన్స్ కూడా అనుమానం కలుగుతుంది. ఇటీవల ఓ బుల్లి సింగర్ మీడియాతో మాట్లాడుతూ.. నేను సలార్ లో ప్రభాస్, యశ్, పృథ్వీరాజ్ సుకుమారన్ అంకుల్కి పాట పాడాను" అని చెప్పుకొచ్చింది.
ఇప్పుడు ట్రైలర్ లో ఈ షాట్, ఆ బుల్లి సింగర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ప్రశాంత్ నీల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సలార్, కేజీఎఫ్ కి మధ్య కనెక్షన్ లేదని చెప్పారు. అయితే ఆయన సలార్ లో యశ్ లేరని ఏమి చెప్పలేదు. రాకీ భాయ్ పాత్రతో కాకుండా యశ్ ఈ సినిమాలో మరో పాత్రతో కనిపించబోతున్నారా..? ఆ విషయాన్ని మేకర్స్ రహస్యంగా ఉంచుతున్నారా..? అనే సందేహాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరి యశ్ ఈ మూవీలో కనిపిస్తాడా లేదా అనేది తెలియాలంటే డిసెంబర్ 22 వరకు వేచి చూడాల్సిందే.
Next Story