Mon Dec 23 2024 23:32:59 GMT+0000 (Coordinated Universal Time)
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా "యశోద" రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా ఇది. హరిశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి..
చైతూతో విడాకుల తర్వాత సమంత సినీ కెరియర్ పై దృష్టి సారించింది. వరుస సినిమాలతో బిజి బిజీగా గడుపుతోందీ బ్యూటీ. యూటర్న్ సినిమా నుంచి సమంత ఎక్కువగా లేడా ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకు మొగ్గుచూపుతోంది. యూ టర్న్, ఓ బేబీ సినిమాలు భారీ విజయాల్ని అందుకున్నాయి. తాజాగా సమంత చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా "యశోద". ఈ సినిమా సమంత ఓ గర్భవతిగా కనిపించనుంది.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా ఇది. హరిశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాను నవంబర్ 11వ తేదీన విడుదల చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. ఇప్పటికే "యశోద" నుంచి వచ్చిన అప్డేట్స్ కి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఉన్ని ముకుందన్, మురళీశర్మ, సంపత్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. కాగా.. సమంత నుంచి నెక్స్ట్ శాకుంతలం, ఖుషి సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.
Next Story