Sun Dec 22 2024 14:53:15 GMT+0000 (Coordinated Universal Time)
Yatra 2 : యాత్ర 2 సినిమాలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ క్యారెక్టర్ .. అదిరిందంటూ?
యాత్ర 2 సినిమా విడుదలయింది. అయితే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ అభిమానులతో థియేటర్లు నిండిపోతున్నాయి.
యాత్ర 2 సినిమా విడుదలయింది. అయితే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ అభిమానులతో థియేటర్లు నిండిపోతున్నాయి. అయితే సినిమాలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత ప్రభుత్వ హయాంలో అరటి తోటలను ధ్వంసం చేశారని నందిగం సురేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సురేష్ కు బాపట్ల ఎంపీ సీటు ఇచ్చారు. ఆయన విజయం సాధించి ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఆ సీన్ ఇప్పుడు సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని వైసీపీ అభిమానులు నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.
నెట్టింట కామెంట్స్...
నందిగం సురేష్ పాత్ర ధారిని పోలీసులు చితక్కొటి ఇంటి వద్ద పడేసి వెళ్లడం, ఆ తర్వాత జగన్ పాత్రధారి వచ్చి సురేష్ కుటుంబాన్ని ఓదార్చి.. ఎవరైతే నిన్ను కొట్టారో వారిచేతనే సెల్యూట్ చేయిస్తానని అనడంతో ఈలలు, చప్పట్లతో థియేటర్లు మారుమోగి పోతున్నాయని వైసీపీ అభిమానులతో పాటు నందిగం సురేష్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు. అయితే సురేష్ పాత్రధారి ఎంపీ అంత అందగా లేడని కూడా వారు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తం మీద యాత్ర 2 సినిమాలో నందిగం సురేష్ పాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story