నువ్వు గ్రేట్ విజయ్..!
ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఎవరికి ఆశాజనకంగా లేవు. ఒక్క సినిమా పరిశ్రమ అనే కాదు…. అనేక ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద కంపెనీలే కరోనా కి దణ్ణం పెట్టాల్సి [more]
ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఎవరికి ఆశాజనకంగా లేవు. ఒక్క సినిమా పరిశ్రమ అనే కాదు…. అనేక ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద కంపెనీలే కరోనా కి దణ్ణం పెట్టాల్సి [more]
ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఎవరికి ఆశాజనకంగా లేవు. ఒక్క సినిమా పరిశ్రమ అనే కాదు…. అనేక ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద కంపెనీలే కరోనా కి దణ్ణం పెట్టాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు సినిమా పరిశ్రమ మళ్ళీ ఓ కొలిక్కి రావాలంటే సినిమా బడ్జెట్ కంట్రోల్ లాగే హీరో హీరోయిన్స్ పారితోషికాల తగ్గింపు ప్రక్రియ అనేది చాలా అవసరమని రాజమౌళి లాంటి డైరెక్టర్ చెప్పారు. అయితే ఇప్పటివరకు పారితోషికాల తగ్గింపు విషయంలో ఏ ఒక్క హీరో కానీ హీరోయిన్ కానీ ముందుకు రాలేదు. అలాగే తమిళ, హిందీ ఏ భాష హీరోలు పారితోషికాల విషయంలో వెనక్కి తగ్గినట్టుగా న్యూస్ లేదు.
అయితే తాజాగా తమిళ హీరో విజయ్ తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్టుగా వార్తలొస్తున్నాయి. విజయ్ తన పారితోషికంలో ఓ 20 శాతం తగ్గిస్తునంట్టుగా నిర్మాతలకు చెప్పిఅంట్టుగా సోషల్ ఇండియా టాక్. మాములుగా స్టార్ హీరో విజయ్ పారితోషికం అతి భారీ కనుక నిర్మాతకు ఇది చాలా పెద్ద ఉపశమనమే అంటున్నారు. అయితే 20 శాతం సరిపోతుందా లేదా ఇంకా తగ్గించాలి అనేది ముందు ముందు ఆలోచిస్తానని నిర్మాతలకు విజయ్ హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే విజయ్.. ఏ ఆర్ మురుగదాస్ తో చేయనున్న మూవీ పారితోషికంలో 20శాతం తగ్గివుంచినట్లుగా టాక్. మరి విజయ్ చేసిన పని చూసి హీరోలంతా బుద్ది తెచ్చుకోవాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ న్యూస్ మన హీరోల దాక చేరిందో లేదో చూడాలి.
- Tags
- vijay