నువ్వు గురూజీవి కాదంటే..!!
మాజీ హీరోయిన్ పూనమ్ కౌర్ ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఓ టాప్ దర్శకుడిని, హీరోని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు సదరు హీరోని పక్కనబెట్టి మరోసారి [more]
మాజీ హీరోయిన్ పూనమ్ కౌర్ ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఓ టాప్ దర్శకుడిని, హీరోని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు సదరు హీరోని పక్కనబెట్టి మరోసారి [more]
మాజీ హీరోయిన్ పూనమ్ కౌర్ ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఓ టాప్ దర్శకుడిని, హీరోని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు సదరు హీరోని పక్కనబెట్టి మరోసారి ఆ సీక్రెట్ దర్శకుడిని ఓ ఆట ఆడుకుంది. పూనమ్ కౌర్ ఏ దర్శకుడ్ని ఉద్దేశించి ట్వీట్స్ వేస్తుందో అందరికి తెలుసు. కానీ ఆపేరే బయటికి రాదు. తాజాగా సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య తో మరోసారి పూనమ్ కౌర్ ఆ దర్శకుడిని టార్గెట్ చేసింది. తాను చాలా రోజుల నుండి మానసిక ఒత్తిడితో బాధపడుతున్నా అని.. దానికోసం నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని.. అయితే మానసిక వ్యాధితో బాధపడేటప్పుడు ఓ దర్శకుడిని ఫోన్ చేసి మానసిక వ్యాధిని అధికమించాలంటే ఏం చెయ్యాలో ఓ సలహా ఇమ్మని అడిగెను అని చెబుతుంది.
అయితే సదరు దర్శకుడు తనని సినిమాల నుండి తప్పించడమే కాకుండా, తనకి అవకాశాలు లేకుండా చేసాడని, అలాగే తనని ఏ ఈవెంట్ కి రాకుండా అడ్డుకున్నాడని, అయితే తాను సలహా అడిగినప్పుడు మాత్రం నువ్వు ఆత్మహత్య చేసుకుంటే కేవలం ఒక్క రోజు వార్తల మిగిలిపోతావని.. అంతేకాని.. ఇంకేం జరగదని చెప్పాడని అంటుంది. ఆ దర్శకుడి వలన చాలా మానసిక వేదన అనుభవించ అని.. స్టేజ్ ఎక్కి.. అందరి గురించి కవిత రూపంలో అందరిని పొగుడుతూ ఉపన్యాసాలు ఇస్తాడని.. నువ్వు గురుజీవి కాదని నీ లాభం కోసం నువ్వు నీ స్నేహితులని కూడా మభ్యపెడుతున్నావు అని.. నా మీద నెగెటివ్ ఆర్టికల్స్ రాయించినా నేను మానసికంగా బలంగా మారానని..అంతేకాని ఆత్మహత్య చేసుకోలేదని చెబుతుంది. మరి పూనమ్ కౌర్ మరొక్కసారి ఆ దర్శకుడిని ఇష్టం వచ్చినట్టుగా ఆడేసుకుంది. పూనమ్ ట్వీట్స్ తో ఆ దర్శకుడి పరిస్థితి ఎలా ఉందొ మరి.
- Tags
- Poonam Kaur