Mon Dec 23 2024 16:59:46 GMT+0000 (Coordinated Universal Time)
జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచారం.. సినీ నటుడు అరెస్ట్
తనను పెళ్లి చేసుకోవాలని గట్టిగా అడగ్గా చంపేస్తానని బెదిరించటంతో పోలీసులను ఆశ్రయించింది. ప్రియాంత్రావుపై ..
యువ సినీనటుడు ప్రియాంత్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను ప్రేమ పేరుతో నమ్మించి, అత్యాచారం చేసి మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ అయిన బాధితురాలు ప్రియాంత్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కొత్తగా మా ప్రయాణం'' సినిమా హిరో ప్రియాంత్‌కు ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, ఆ తర్వాత పెళ్లి గురించి అడిగితే మాట దాటివేస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది.
కాగా.. ప్రియాంత్ కు అంతకుముందే పెళ్లైన విషయం తెలిసి బాధితురాలు షాకయింది. భార్య ఉండగా ఇదేంటని అడగ్గా.. నా భార్య అంటే ఇష్టం లేదని, తనకి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని యువతి ఆరోపిస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని గట్టిగా అడగ్గా చంపేస్తానని బెదిరించటంతో పోలీసులను ఆశ్రయించింది. ప్రియాంత్రావుపై జూ.ఆర్టిస్ట్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు.. చీటింగ్, రేప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. త్వరలోనే నిజనిజాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Next Story