Sun Mar 16 2025 08:25:20 GMT+0000 (Coordinated Universal Time)
అమ్మాయిగారి అకౌంట్ హ్యాక్ అయిందట
30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమృత అయ్యర్ ఇన్ స్టా ఖాతాను ఎవరో హ్యాక్ చేశారట.

ప్రముఖులకు చెందిన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్ కు గురవ్వడం పరిపాటిగా మారింది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారి అకౌంట్లను హ్యాక్ చేసి.. వాటిలో అసభ్యకర పోస్టులు, ఫొటోలు పెడుతున్నారు కొందరు ఆకతాయిలు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ను హ్యాక్ చేశారట. ఈ విషయాన్ని అమ్మడు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమృత అయ్యర్ ఇన్ స్టా ఖాతాను ఎవరో హ్యాక్ చేశారట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. తన అకౌంట్ మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయంపై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. గతంలో స్టార్ హీరోయిన్స్ పూజా హెగ్డె, టబు, ఇషా డియోల్, వరలక్ష్మీ శరత్ కుమార్ల సోషల్ మీడియా ఖాతాలు కూడా ఇలాగే హ్యాకింగ్ కు గురయ్యాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి అమృత అయ్యర్ కూడా చేరింది.
News Summary - Young Heroine Amritha Ayyar Instagram Account Hacked
Next Story