Mon Dec 23 2024 17:40:02 GMT+0000 (Coordinated Universal Time)
అదరగొట్టింది కానీ.. అవకాశాలెలా ఉంటాయో?
జంటిల్మన్, నిన్నుకోరి చిత్రాలలో డీసెంట్ నటనతో క్యూట్ అభినయంతో అదరగొట్టిన నివేద థామస్ టాలీవుడ్ కెరీర్ ఏమంత గొప్పగా లేదు. రెండు హిట్ చిత్రాలు చేతిలో ఉన్నప్పటికీ…. [more]
జంటిల్మన్, నిన్నుకోరి చిత్రాలలో డీసెంట్ నటనతో క్యూట్ అభినయంతో అదరగొట్టిన నివేద థామస్ టాలీవుడ్ కెరీర్ ఏమంత గొప్పగా లేదు. రెండు హిట్ చిత్రాలు చేతిలో ఉన్నప్పటికీ…. [more]
జంటిల్మన్, నిన్నుకోరి చిత్రాలలో డీసెంట్ నటనతో క్యూట్ అభినయంతో అదరగొట్టిన నివేద థామస్ టాలీవుడ్ కెరీర్ ఏమంత గొప్పగా లేదు. రెండు హిట్ చిత్రాలు చేతిలో ఉన్నప్పటికీ…. నివేద థామస్ కి స్టార్ హీరోలెవరు పిలిచి అవకాశాలివ్వలేదు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవ కుశ సినిమాలో నివేద కి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఆ సినిమా వలన నివేద కిఎలాంటి ఉపయోగం లేకుండా ఐపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు కళ్యాణ్ రామ్ – కెవి గుహన్ కాంబోలో తెరకెక్కిన 118 అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో కీలక పాత్రలో నటించింది
.
నిన్న శుక్రవారం విడుదలైన 1188 సినిమాకి పాజిటివ్ టాక్ పడింది. ఈ సినిమాలో నివేద నటనను అందరూ పొగిడేస్తున్నారు. సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువైనప్పటికీ.. ఆద్య పాత్రలో నివేద మంచి నటన కనబర్చిందని.. కథ అంతా నివేద చుట్టూ తిరిగేది కావడంతో సినిమాలో ఆమెకు మంచి పాత్ర దొరికింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన చాలా బాగుందని అంటున్నారు. అందుకే నివేథా థామస్ కు స్క్రీన్ టైం తక్కువే కానీ.. ఆమె సినిమా విజయంలో బలమైన ముద్ర వేసిందని…. నటిగా తన ప్రత్యేకతను మరోసారి చాటుకుందని అంటున్నారు.
మరి ఈ సినిమాలో కీలక పాత్రలో మంచి నటనతో ఆకట్టుకున్న నివేద థామస్ కి ఇప్పుడైనా టాలీవుడ్ మంచి పొజిషన్ కల్పిస్తుందో.. లేదంటే.. జై లవ కుశ తర్వాత మాయమై 118 సినిమాలో తేలినట్టు.. మళ్ళీ మాయమై ఎప్పుడో కనబడుతుందా అనేది చూడాలి. ఇకపోతే నివేద లో మంచి నటిమణి దాగున్నప్పటికీ….. ఆమె హైట్ ఆమెకి మైనస్ అని అందుకే… నివేద కి మంచి అవకాశాలు రావడం లేదని అంటున్నారు.
Next Story