ఆ టైటిల్ కోసం పోటీనా?
టాలీవుడ్ లో టైటిల్స్ విషయంలో ఎప్పుడు ఏదో ఒక పోరు జరుగుతూనే ఉంటుంది. ఆ టైటిల్ వలన కొందరి మనో భావాలూ దెబ్బతింటున్నాయని కొంతమంది, కాదు ఆ [more]
టాలీవుడ్ లో టైటిల్స్ విషయంలో ఎప్పుడు ఏదో ఒక పోరు జరుగుతూనే ఉంటుంది. ఆ టైటిల్ వలన కొందరి మనో భావాలూ దెబ్బతింటున్నాయని కొంతమంది, కాదు ఆ [more]
టాలీవుడ్ లో టైటిల్స్ విషయంలో ఎప్పుడు ఏదో ఒక పోరు జరుగుతూనే ఉంటుంది. ఆ టైటిల్ వలన కొందరి మనో భావాలూ దెబ్బతింటున్నాయని కొంతమంది, కాదు ఆ టైటిల్ కాపీ రైట్స్ మావని, మేము రిజిస్టర్ చేయించుకున్నామని.. ఇలా ఎక్కడో ఓ చోట టైటిల్ రచ్చ ఉండనే ఉంది. తాజాగా ప్రభాస్ – రాధాకృష్ణ సినిమాకి జాన్ అనే టైటిల్ వాడుకలో ఉండగా.. దిల్ రాజు తన తమిళ రీమేక్ కి జానూ టైటిల్ విషయంలో యువి నిర్మాతలతో మంతనాలు జరిపి మరీ ఒప్పించి తీసుకున్నాడు. ఆతర్వాత ప్రభాస్ – రాధాకృష్ణ సినిమాని రాధేశ్యాం టైటిల్ పెట్టినట్లుగా తెల్సుతుంది. ఇక తాజాగా ప్రభాస్ కి మరో మరు టైటిల్ విషయంలో పోటీకి వచ్చినట్లుగా చెబుతున్నారు. అది కూడా బాలకృష్ణ అంటున్నారు. బాలకృష్ణ – బోయపాటి కాంబో సినిమాకి ముందు మోనార్క్ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా.. తాజాగా సూపర్ మ్యాన్ టైటిల్ ప్రచారం లోకొచ్చింది. ఈ టైటిల్ కి బోయపాటి ఫిక్స్ అన్నట్లుగా వార్తలొస్తున్నాయి.
అయితే అదే టైటిల్ ని ప్రభాస్ – నాగ్ అశ్విన్ మూవీ కి పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నాగ్ అశ్విన్ సినిమాలో ప్రభాస్ దేవదూత సూపర్ మ్యాన్ లా కనిపిస్తాడని ప్రచారం ఉంది. అందుకే టైటిల్ గా సూపర్ మ్యాన్ పెడితే పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ వస్తుందని నాగ్ అశ్విన్ – ప్రభాస్ భావిస్తుంటే.. ఇప్పుడు ఆ టైటిల్ బాలకృష్ణ – బోయపాటి తన్నుకుపోతున్నారని తెలిసి నాగ్ అశ్విన్ – ప్రభాస్ తలలు పట్టుకున్నారట. అటు బాలయ్య – బోయపాటి సినిమా పరంగా యాక్షన్ ఇమేజ్ తో సూపర్ మ్యాన్ టైటిల్ పర్ఫెక్ట్ అంటుంటే.. నాగ్ అశ్విన్ – ప్రభాస్ కథ పరంగా సూపర్ మ్యాన్ టైటిల్ పక్కాగా ఉందని అంటున్నారు. అంటే స్టార్ అభిమానుల మధ్యన మరో భారీ టైటిల్ రచ్చ లేవనుందని అంటున్నారు.