చిలికి చిలికి గాలివానయ్యేలా ఉంది!!
కరోనా లాక్ డౌన్ ఏమో గాని సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఉప్పూ నిప్పులా మారింది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధంతో.. టాలీవుడ్ మొత్తం హాట్ హాట్ గా [more]
కరోనా లాక్ డౌన్ ఏమో గాని సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఉప్పూ నిప్పులా మారింది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధంతో.. టాలీవుడ్ మొత్తం హాట్ హాట్ గా [more]
కరోనా లాక్ డౌన్ ఏమో గాని సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఉప్పూ నిప్పులా మారింది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధంతో.. టాలీవుడ్ మొత్తం హాట్ హాట్ గా మరిపోయింది. బాలయ్య ఎన్టీఆర్ జయంతి రోజున సినిమా పెద్దలని అనకూడని మాటలనడంతో రేగిన చిచ్చు ఇప్పుడు గాలి వానలా ఇండస్ట్రీని చుట్టేసింది. బాలకృష్ణ కి నిర్మాత సి కళ్యాణ్ కౌంటర్ వెయ్యడం.. ‘మా’ వారే బాలయ్యని పిలవాలి కానీ మాకేం పని అనడం, నాగబాబు ఏకంగా బాలకృష్ణ ఇండస్ట్రీకి, తెలంగాణ ప్రభుత్వానికి సారి చెప్పాలనడం.. నువ్వు ఇండస్ట్రీకి కింగ్ కి కాదు.. హీరోవి మత్రమే అనడం, తాజాగా చిరంజీవి ఇంట్లో మళ్ళీ సినిమా పెద్దలతో మీటింగ్ జరగడం.. ఈ మీటింగ్ కి కూడా బాలయ్య కి ఆహ్వానం అందకపోవడం అబ్బో మేటర్ చాలా నడిచింది.
ఇక చిరు ఇంట్లో మీటింగ్ జరిగిన తర్వాత సి కళ్యాణ్ వచ్చి ఈ కరోనా విషయాలన్నింటిని.. కేసీఆర్ గారు చిరంజీవి, నాగార్జునని చూడమన్నారని చెప్పడం, తమ్మారెడ్డి భరద్వాజ అయితే మహేష్, వెంకటేష్ లాంటోళ్ళనే ఈ మీటింగ్స్ కి పిలవలేదని, అయినా బాలయ్య లేకపోతె ఇండస్ట్రీ లేదని… నన్ను కూడా పిలవలేదని సర్ది చెప్పాడు. ఇక ఇదంతా సద్దుమణిగాక.. మా అధ్యక్షుడు నరేష్ ట్వీట్ కాకపుట్టించింది. సి కళ్యాణ్ చెప్పిన బాలయ్యని ‘మా’ పిలవాలని చెప్పడం నన్ను షాక్ కి గురి చేసింది అని.. అసలు మా అధ్యక్షుడినైనా నన్ను కానీ, మా జనరల్ సెక్రటరీని కానీ ఈ సమావేశాలకు పిలవలేదు. అలాంటిది ఈ సమావేశాలకు వేరొకరిని ఎలా ఆహ్వానించగలను అంటూ ట్వీట్ చెయడం చర్చనీయాంశమైంది. అంటే ఇండస్ట్రీలో చిరు అందరిని కలుపుకుపోకుండానే ఈ పెద్దరికం చేస్తున్నాడా? అసలు పెద్దన్నల్లా చిరు అన్ని విషయాలను నెత్తిన వేసుకుకుంటున్నాడా? లేదా మీరే ముందుండి నడపాలి అంటూ ఎవరైనా చిరుని అడుగుతున్నారా? ఏమో కానీ ఇప్పుడు ఈ రచ్చ ఎక్కడికి దారితీస్తుందో అంటూనే, ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ ఇండస్ట్రీని ముంచడమటుంచి.. ఇంతగా రచ్చకెక్కడం మాత్రం ఏం బాలేదని పలువురి అభిప్రాయం.