నందిత మనసు మార్చుకుందా?
'నీకు నాకు డాష్ డాష్, ప్రేమకథా చిత్రమ్, లవర్స్' వంటి చిత్రాల ద్వారా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి నందిత. కాగా ఆమె ఇప్పటివరకు గ్లామర్‌షోకు దూరంగా ఉంటూ వచ్చింది. దాంతో ఆమె కేవలం చిన్న చిత్రాలకు, చిన్న హీరోలకు పరిమితం అవుతోంది. అందం, అభినయం ఉన్నప్పటికీ గ్లామర్‌షో చేయకపోవడమే ఆమెకు శాపంగా మారింది. అదే ఈ అమ్మడు అందాల ఆరబోతకు కూడా సై అంటే ఆమె భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మరి ఈ మాటలకు ఆమె చెవులకు కూడా చేరాయని సమాచారం. ఆమె నారారోహిత్ సరసన నటిస్తున్న 'సావిత్రి' చిత్రం రేపు విడుదలకు ముస్తాబవుతోంది. కాగా ఈచిత్రం తర్వాత ఆమె తాను నటించే చిత్రాలలో ఏదో విధంగా మెల్లిమెల్లిగా గ్లామర్‌షోకు సముఖంగా ఉందనే సంకేతాలను ఆల్రెడీ ఇండస్ట్రీకి పంపింది. స్కిన్‌షోకు సిద్దమేనంటూ ఆమె దర్శకనిర్మాతలకు, హీరోలకు సంకేతాలు పంపడంతో ఈ హోమ్లీ హీరోయిన్ను త్వరలోనే మాంచి హాట్‌గా చూసే అవకాశం శృంగారప్రియులకు త్వరలోనే ఉందని, మొత్తానికి కాస్త ఆలస్యమైనా ఆమె నిర్ణయం నేటి పరిస్థితుల్లో సరైనదే అంటున్నారు.