మరో ఖరీదైన విడాకులకు తెర లెగిసింది
హాలీవుడ్ హీరోయిన్ యాంజిలీనా జోలీ నుంచి మోలీవుడ్ హీరోయిన్ అమల పాల్ వరకు ఈ ఏడాది సెలబ్రిటీ స్టేటస్ వున్నా అనేక మంది విడాకులు మంజూరు చేయండి అంటూ న్యాయస్థానానికి అభ్యర్ధనలు పెట్టుకున్నారు. ఈ జాబితాలోకి తాజాగా హాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హంక్ జార్జ్ క్లోని కూడా చేరిపోయాడు. ఆయనకీ చాలా ఏళ్ళ క్రితం తొలి వివాహం పెటాకులు కావటంతో వివాహం పట్ల విముఖత పెంచుకుని చాలా కలం ఎఫైర్స్ ని డేటింగులకే పరిమితం చేసాడు తప్ప వైవాహిక జీవితం జోలికి పోలేదు. కానీ సోషల్ యాక్టీవిస్ట్ కం న్యాయవాది ఐన అమల్ తో ఆయన సాన్నిహిత్యం వివాహానికి దారి తీసింది. 2014 లో ఇటలీలో ఈ జంట తమ సాన్నిహిత్యాన్ని వైవాహిక జీవితంగా మార్చుకుంది.
రెండు సంవత్సరాలు గడిచే సారికే వీరి వైవాహిక జీవితం బెడిసికొట్టింది. వీరి మధ్య ఏర్పడ్డ విభేదాలు విడాకులకు దారి తీయటానికి వీరి మధ్య తీవ్రంగా వచ్చిన ఒక అభిప్రాయం భేదమే కారణమని సమాచారం. అమల్ సంతానం కోరుకుంటుండగా జార్జ్ క్లోని మాత్రం తనకు పిల్లలు మీద పెద్దగా శ్రద్ద ఉండదు అని తాను పిల్లలకి తండ్రిగా ఉండలేను అని అమల్ ని వ్యతిరేకించడంతో వీరి మధ్య సమసిపోని అభిప్రాయం భేధంగా మారి విడాకులకు దారి తీసింది అంట. అయితే ఈ విడాకులు మంజూరు అయ్యేనాటికి జార్జ్ క్లోని భరణం కింద అమల్ కు 300 మిలియన్ డాలర్లు చెల్లించనున్నాడంట. దీని బట్టి చూస్తే ఈ విడాకులు అతి ఖరీదైన విడాకులలో ఒకటిగా నిలవనుంది.