Fri Oct 18 2024 04:14:38 GMT+0000 (Coordinated Universal Time)
సూర్య నుంచి రామ్ చరణ్ తేజ్ కి ముప్పు
జన్జీర్, గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్ లీ చిత్రాలతో చతికిల పడ్డ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన ఆశలన్నీ తమిళ బ్లాక్ బస్టర్ తన్ని ఊరువం రీమేక్ మీదే పెట్టుకున్నాడు. కాగా అనుకోని అనివార్య కారణాల వలన ధ్రువ టీం ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం విజయ దశమికి ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. ఇప్పుడు చిత్రీకరణ పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న తరుణంలో పెద్ద నోట్ల రద్దు తీవ్రత సినిమా వ్యాపారంపై చూపుతున్న ప్రభావానికి దడిచి డిసెంబర్ మొదిటి వారం నుంచి రెండవ వారానికి వాయిదా పడింది ధ్రువ.
డిసెంబర్ 9 న విడుదల ఖాయం అని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించేయ్యగా, ఈ వాయిదా ధ్రువ వసూళ్ల పై మరిన్ని సవాళ్లు విసిరింది. ముందుగానే సింగం సిరీస్ లో మూడవ భాగం ఎస్ త్రీ చిత్ర విడుదల 16 వ తేదికి ఖరారు ఐయ్యింది. సూర్య చిత్రాలు తమిళంలో నామమాత్రపు వసూళ్లు సాధించనవి కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపిన సందర్భాలు అనేకం. ఈ తరుణంలో మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన సింగం సిరీస్ విడుదల కావటం ధ్రువ కు ఇబ్బందికరంగా మారింది. కేవలం వారం గ్యాప్లో ఈ విడుదల వుంది. మొదటి వారంలోనే ధ్రువ సినిమా మొత్తం రికవరీ చెయ్యటం పెద్ద నోట్ల రద్దు చర్య తో అసాధ్యం అని సినీ ప్రముఖుల అంచనా. ఈ ఇబ్బందులన్నిటిని అధిగమించి ధ్రువ సంచలన విజయం నమోదు చేస్తుందో లేదో చూద్దాం.
Next Story