కాదలి మూవీ రివ్యూ
నటీనటులు: పూజ కే దోషి, హరీష్ కళ్యాణ్, సాయి రోనాక్, పల్లవి బానోత్ తదితరులు
సంగీతం: ప్రవీణ్, శ్యామ్, ప్రసన్
నిర్మాత: పట్టాభి ఆర్ చిల్కురి
దర్శకత్వం: పట్టాభి ఆర్ చిల్కురి
ఐటి శాఖా మంత్రి కేటీఆర్ ఫ్రెండ్ అయిన పట్టాభి ఆర్ చిల్కురి ఇండస్ట్రీలో పెద్దగా సపోర్ట్ లేక చాలాకాలంగా అసిస్టెంట్ డైరెక్టర్ గానే కొనసాగాడు. అయితే మిత్రుడు కేటీఆర్ ఇచ్చిన ప్రోద్బలంతో ఈ కాదలి చిత్రాన్ని అందరూ కొత్త నటీనటులతో తెరకెక్కించాడు. ఇందులో నటించిన నటీనటులంతా కొత్తవారే అవడం... దర్శకుడు కూడా కొత్తగా ఇండస్ట్రీకి పరిచయం అవడం వంటి ఆసక్తికర విషయాలతో ఈ సినిమా ప్రేక్షకులముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాకి ప్రమోషన్ కి కూడా ఇండస్ట్రీలోని స్టార్ హీరో అయిన రామ్ చరణ్ తో చేయించడం... అలాగే కేటీఆర్ కూడా ఈ సినిమాకి మంచి ప్రమోషన్ ఇవ్వడం వంటివి ఈ సినిమాకి బాగా కలిసొచ్చే అంశాలు. మరి కొత్తగా తీసుకున్న నటీనటులు ఈ కాదలి తో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నారో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: డాక్టర్ బంధవికి పెళ్లి అంటే ఉన్న విరక్తితో ఆమె తల్లి తండ్రులు ఎన్ని సంబందాలను తీసుకొచ్చినా తిరస్కరిస్తూ వస్తుంది. అయితే బంధవికి పెళ్ళికాదేమోన్న బెంగతో తల్లితండ్రులు టెన్షన్ పడుతుంటారు. అటువంటి సమయంలో బంధవి ఫ్రెండ్స్ మరియు బంధవి బామ్మా ఇచ్చిన సలహాతో తానింతవరకు పెళ్లి చూపుల్లో చూసిన కుర్రాళ్లందరిలో తనకు నచ్చిన కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే డెసిషన్ కి వస్తుంది బంధవి. అదేసమయంలో బంధవికి క్రాంతి ( హరీష్ కళ్యాణ్), కార్తీక్( సాయి రోనాక్) లు ఇద్దరు నచ్చి ఆమె ఇద్దరినీ ఎంచుకుంటుంది. అయితే వీరిద్దరూ తన అభిరుచులకు దగ్గరగా ఉండడంతో ఫైనల్ గా ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూషన్ కి గురవుతుంది. మరి క్రాంతి, కార్తీక్ లు ఇద్దరూ గుణగణాలలో బుద్ధిమంతులు.... ఇద్దరూ బంధవికి తగినవారే అనిపిస్తుంటుంది. మరి చివరికి బంధవి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుందా? లేకపోతె క్రాంతి ని పెళ్లి చేసుకుంటుందా..? అసలు బంధవి నిర్ణయాన్ని ఆమె తల్లితండ్రులు ఒప్పుకుంటారా? అనేది మాత్రం వెండితెర మీద కాదలి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల పాత్ర: బంధవిగా పూజ కే దోషి కి మొదటి సినిమానే అయినా నటనతో, క్యూట్ లుక్స్ తో బాగా ఆకట్టుకుంది. బంధవి పాత్రకి పూజ ప్రాణం పోసిందని చెప్పాలి. అయితే ఆమెలో ఉన్న మైనస్ ఆమె ఎత్తు. బాగా ఎత్తు తక్కువ ఉండడంతో ఆమెకు అదే మైనస్ ఆ... అనిపిస్తుంది. మరి నిజంగా సినిమాలో నటించిన హీరోలేమో అమితాబ్ లాగా పొడుగా వుంటారు. మరి పూజయేమో జయ బచ్చన్ లాగ పొట్టిగా ఉంటుంది. ఆ హీరోలిద్దరిపక్కన పూజ తేలిపోయింది. మరి ఆమె ఎత్తు విషయంలో దర్శకుడు కాస్త మేనేజ్ చెయ్యగలిగితే బావుండేది. సాయి రోనక్, హరీష్ కళ్యాణ్ లి ఇద్దరూ చూడడానికి బావున్నారు. అయితే నటన పరంగా ఇద్దరూ వీగిపోయారు. ఇండస్ట్రీకి మొదటిసారి పరిచయం అవడం మూలంగా నటనలో తేలిపోయారు. ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టులేక నీరసపడ్డారు. ఇక మిగతా నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు పట్టాభి విషయానికొస్తే ఒక రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టు తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సినిమాని తెరకెక్కించాడు. కానీ కథ విషయంలో దర్శకుడు తప్పుచేసాడనే చెప్పాలి. కథ పై ఏమాత్రం దృష్టి పెట్టినా... అలాగే తొలిపరిచయంలో తీసుకున్న హీరోలపైనా శ్రద్ధపెట్టినా... స్క్రీన్ ప్లే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటె సినిమా ఫలితం మరోలా ఉండేది. మరి కేటీఆర్, రామ్ చరణ్ వంటివారితో ప్రమోషన్ చేపించిన ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు పెదవి విరవడం మాత్రం ఖాయం. మరి మొదటి ప్రయత్నంలో కాస్త ఆకట్టుకున్న పట్టాభి.... పై విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుని ఉంటే మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యేవాడు. ఇక సంగీతం విషయానికి వస్తే పాటలు ఈ సినిమాకి మైనస్ అనే చెప్పాలి. ఏమాత్రం ఆకట్టుకొని మ్యూజిక్ అక్కడక్కడా చికాకు తెప్పిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పించలేకపోయింది. కానీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. మంచి లొకేషన్స్ ని తెరకెక్కించడంలో సినెమాటోగ్రఫీకి హైలెట్ అయ్యింది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఎడిటింగ్ లో చాలా లోపాలున్నాయి. అలాగే స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకోలేకపోయింది. నిరణాత్మక విలువలు కూడా మాములుగా వున్నాయి.
ప్లస్ పాయింట్స్: కొన్ని ఎమోషనల్ సీన్స్, హీరోయిన్, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: కథ, కథనం, దర్శకుడు, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, క్లైమాక్స్
రేటింగ్: 1 .75 /5