కథలో రాజకుమారి మూవీ రివ్యూ
నటీనటులు: నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత, తనికెళ్ల భరణి, ప్రభాస్ శ్రీను
సంగీతం: ఇళయరాజా, విశాల్ చంద్రశేఖర్
నిర్మాతలు: సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరమ్ సుధాకర్ రెడ్డి, కృష్ణ విజయ్
దర్శకత్వం: మహేష్ సూరపనేని
నారా రోహిత్ తన సినిమాల్లో హీరోయిజాన్ని చూపించడం కన్నా కథలో కొత్తదనం కోరుకుని..... హీరో పాత్ర ఎలివేట్ అయ్యేలా చూసుకుంటాడు. రోహిత్ నటించిన సినిమాలన్నీ పరిశీలిస్తే నారా రోహిత్ చేసిన పాత్రలన్నీ ఒకదానికొకటి విభిన్నంగా ఉంటాయి. కమర్షియల్ ఎలిమింట్స్ ఉన్న కథలను తీసుకుని నాలుగు ఫైట్స్, నాలుగు పాటలతో సినిమా చెయ్యాలనుకోడు. మంచి కథలనే నమ్ముకుని సినిమాలు చేస్తుంటాడు. రోహిత్ అలా చేసిన సినిమాలు అన్ని విజయం సాధించక పోయినా, నటుడిగా మాత్రం మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఇక నారా రోహిత్ జ్యో అచ్యుతానందా సినిమాలో నాగ సౌర్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని ఆ సినిమాని సక్సెస్ దిశగా నడిపించాడు. అదే ఫార్ములాతో మళ్ళీ ఇప్ప్పుడు కూడా నాగ సూర్య గెస్ట్ రోల్ లో కనబడుతూ రోహిత్ ఫుల్ లెంత్ రోల్ చేసిన కథలో రాజకుమారి చిత్రాన్ని రోహిత్, మహేష్ సూరపనేని దర్శకత్వంలో చేసాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ అప్పటినుండి సినిమాపై ఆసక్తి ఏర్పడేలా చేసిన వీరు ఆ ఆసక్తిని కథలో రాజకుమారి ట్రైలర్ తో మరింత పెంచారు. అయితే ఈసినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకోవడం... సైలెంట్ గా విడుదలకు సిద్ధం చెయ్యడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. అసలు నారా రోహిత్ - మహేష్ సూరపనేని కలయికలో తెరకెక్కిన కథలో రాజకుమారి సినిమా ఎటువంటి అంచనాలు, ఆర్భాటాలు లేకుండానే సైలెంట్ గా థియేటర్స్ లోకి దిగిపోయింది. మరి ఈ సినిమాపై హీరో రోహిత్ అస్సలు హోప్స్ పెట్టుకున్నాడా? అనే అనుమానం వచ్చేస్తుంది అందరిలో. మరి ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథలో రాజకుమారి ప్రేక్షకులను ఏమేర మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
సినిమాల్లో నటుడిగా ఎదగడానికి తనకి నచ్చిన విలన్ పాత్రలు వేస్తుంటాడు అర్జున్ (నారా రోహిత్). సినిమాలతో మంచి స్టేటస్, అలాగే పేరుకు తగ్గ అవార్డులు అందుకుంటూ విజయ గర్వంతో విర్రవీగుతుంటాడు. సినిమాల్లో అర్జున్ ఎలా ఉంటాడో.... బయట కూడా అలానే ఉంటాడు. ఎవ్వరిని కేర్ చెయ్యకుండా... ఎవరిని పట్టించుకోకుండా తనో పెద్ద స్టార్‌నన్న గర్వం ఉన్నకొలది ఎక్కువవుతూ ఉంటుంది. తన పక్కన ఉండేవాళ్ళని చాలా హీనంగా చూస్తుండే అర్జున్ జీవితంలో ఓ ఊహించని ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ అర్జున్ జీవితాన్నే పూర్తిగా మార్చివేస్తుంది. ఆ మార్పు వలన సినిమాలో తాను చేస్తున్న పాత్రలకు న్యాయం చేయలేకపోతుంటాడు అర్జున్. దీంతో బాగా నిరాశలో మునిగిపోతాడు. అయితే అర్జున్ తాను ఇదివరకు అర్జున్ లా మారాలని... ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా చాలా మందిని ఈ విషయమై సలహా అడుగుతాడు. చివరకి ఓ వ్యక్తి అర్జున్ దగ్గరికి వచ్చి నీ జీవితంలో నీకున్న శత్రువు ఎవరో గుర్తించు. వారి లైఫ్‌లోకి వెళ్లి..వారి ఆనందాలను దూరం చేయ్ . అప్పుడు నీలో రాక్షసత్వం బయటకొస్తుంది. నటుడిగా తిరిగి నువ్వు పుంజు కుంటావ్ అని చెబుతాడు. అదిగో అప్పటినుండి తన శత్రువు ఎవరో అంటూ తెగ ఆలోచిస్తుంటాడు అర్జున్. మరి అర్జున్ శత్రువు ఎవరు? అసలు కథలో రాజకుమారి టైటిల్ కి హీరోయిన్ కి గల సంబంధం ఏమిటి? సీత మీద అర్జున్ ఎందుకు పగ పెంచుకుంటాడు? అసలు ఈ సినిమాలో నాగ సౌర్య గెస్ట్ రోల్ ఏమిటి? అనేది స్క్రీన్ మీద కథలో రాజకుమారి చూడాల్సిందే.
నటీనటులు:
అర్జున్ పాత్రలో నారా రోహిత్ ఇరగదీసాడు. రెండు వేరియేషన్స్ ఉన్న ఈ అర్జున్ పాత్రలో రోహిత్ నటన మెప్పిస్తుంది. రోహిత్ కెరీర్లో మరో మంచి పాత్రగా అర్జున్ నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. ఇక గెస్ట్ రోల్ లో నాగశౌర్య నటన ఒకేగా వుంది. అయితే ఈ సినిమా టైటిల్ పాత్రధారి నమితా ప్రమోద్‌కి మంచి పాత్రే లభించింది. కానీ నటనలో నమిత తేలిపోయింది. ఇలాంటి పాత్రని అనుభవం ఉన్న హీరోయిన్ ఎవరైనా చేస్తే ఆ ప్రభావం వేరేగా ఉండేది. తనికెళ్ల భరణి, అజయ్, ప్రభాస్ శ్రీను, అవసరాల శ్రీనివాస్ తమ పరిధిలో నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు:
కథలో రాజకుమారి అనే టైటిల్ వినడానికి చాలా బావుంటుంది. మంచి టైటిల్ ని మంచి కథని ఎంచుకున్న దర్శకుడు మహేష్ ఈ కథను సినిమాగా మలచడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. సినిమా మొదలుపెట్టినప్పుడు కొన్నిసన్నివేశాల్లో ఆసక్తి గా అనిపించిన సినిమా.. ముందుకు వెళ్లే కొద్దీ నీరసం తెప్పించింది. అర్జున్ పాత్రదారి చెడ్డవాడి నుంచి మంచి వాడిగా మారడానికి గల కారణాలను వివరించక పోవడం.... సీతపై అర్జున్ పెంచుకున్న శత్రుత్వానికి పెద్దగా కారణం లేకపోవడం చూస్తుంటే పెద్దగా లాజిక్ అనిపించదు. ఇక ఈ సినిమాలో కామెడీకి కూడా పెద్దగా స్కోప్ లేదు. ఇక కథలో.... సెకండాఫ్ మొత్తం నెమ్మదిగా సాగుతూ.. ప్రేక్షకుడికి బోర్ ఫీల్ అయ్యేలా చేసింది. అసలు ఒక సాధ సీదా అమ్మాయిపై... ఒక నటుడు పగ తీర్చుకోవడం అనే పాయింట్ ప్రేక్షకుల కు అర్ధం కానీ విషయం..మరి కొత్త దర్శకుడు మహేష్ మాత్రం ఈ సినిమా విషయంలో టోటల్ గా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఇక కథలో రాజకుమారి సంగీతం సమకూర్చిన మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా రూపొందిన రెండు పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఒకే ఒకే గా వుంది. ఇక నరేష్ కె రానా సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించేలా వుంది.. హీరోహీరోయిన్ల చిన్నప్పుడు సాగే దృశ్యాలను అందంగా చూపించాడు. ఎడిటింగ్ విషయానికి వస్తే ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలున్నాయి. ఇక నిర్మాణ విలువలకు వంక పెట్టడానికి ఏమి లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్: నారా రోహిత్, నాగ సౌర్య, హీరోయిన్ నమిత ప్రమోద్, కొన్ని కామెడీ సీన్స్, రెండు పాటలు
మైనస్ పాయింట్స్: కథనం, దర్శకత్వం, ఎడిటింగ్, సెకండ్ హాఫ్, స్లో నేరేషన్
రేటింగ్: 2.0/5