చెలియా మూవీ రివ్యూ
నటీనటులు: కార్తీ, అదితి రావ్ హైదరి, శ్రద్ధ శ్రీనాథ్, రుక్మిణి విజయకుమార్, ఢిల్లీ గణేష్
మ్యూజిక్ డైరెక్టర్: ఏ. ఆర్ రెహ్మాన్
ప్రొడ్యూసర్: దిల్ రాజు
డైరెక్టర్: మణిరత్నం
విలక్షణ సినిమాలకు పెట్టింది పేరు దర్శకుడు మణిరత్నం. ఆయన తీసే చిత్రాలు కొన్నిసార్లు ప్లాపులు చవిచూసిన కూడా మణిరత్నం కొత్త చిత్రం వస్తుంది అంటే చాలు యువత ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. మణిరత్నం ఎక్కువగా యువతకు కనెక్ట్ అయ్యే చిత్రాలనే తెరకెక్కిస్తుంటాడు. ఆయన తమిళంలో డైరెక్ట్ చేసే ప్రతి సినిమాను ఇక్కడ తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తుంటాడు. మణిరత్నం ఇంతకుముందు తీసిన సినిమా 'ఓకె బంగారం' యూత్ ఫుల్ లవ్ స్టోరీ. ఆ చిత్రం చాలా పెద్ద హిట్. మళ్ళీ మణి రత్నం ఇప్పుడు తమిళ నటుడు కార్తీ, బాలీవుడ్ నటి అదితి రావ్ హైదరి జంటగా 'చెలియా' చిత్రాన్ని తెరకెక్కించాడు. కార్తీ కూడా అటు తమిళం ఇటు తెలుగులో మంచి పేరున్న నటుడు. 'నా పేరు శివ, ఊపిరి, కాష్మోరా' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు 'చెలియా' చిత్రంలో కార్తీ మిలిటరీ పైలట్ గా మొదటిసారిగా నటిస్తున్నాడు. హీరోయిన్ అదితి డాక్టర్ గా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని సినిమాలపై ఎంతో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక దిల్ రాజు ఏదైనా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు అంటే ఆ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంటుందని కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. ఇక ఈ చిత్రంలో ప్రేమ, ఎమోషన్ కి సమానమైన పీట దర్శకుడు వేసినట్లు ట్రైలర్స్, పోస్టర్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఎన్నో అంచనాల మధ్యన చెలియా చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరించారో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: వరుణ్ ( కార్తీ) ఒక పైలెట్. స్వతహాగా మంచివాడే అయిన వరుణ్ కి కాస్త దూకుడు ఎక్కువ. ఒకసారి అనుకోకుండా హాస్పిటల్ లో లీలా( అదితి రావ్) పరిచయం ఏర్పడుతుంది. అదికాస్తా ప్రేమగా మారుతుంది. అయితే వరుణ్ కున్న దూకుడు స్వభావంతో ఎంతో ప్రేమించిన లీలాపై కోపాన్ని ప్రదర్శిస్తుంటాడు. అంతలోనే తన తప్పు తెలుసుకుని లీలాకి క్షమాపణ చెబుతుంటాడు. వరుణ్, లీలా పెళ్లి చేసుకుందామనుకున్న టైమ్ లో వరుణ్ లీలా కి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు. అక్కడినుండి లీలా, వరుణ్ మధ్యన విభేదాలు ఏర్పడతాయి. ఇలాంటి దూకుడు స్వభావం వున్న వరుణ్ అంటే లీలా తల్లితండ్రులకి కూడా నచ్చదు. వరుణ్, లీలా లు విడిపోతారు. అలాంటి టైమ్ లోనే వరుణ్ పాకిస్తానీ బందీగా చిక్కుతాడు. అసలు వరుణ్ పాకిస్తాన్ సైనికులకు ఎలా చిక్కాడు? పాకిస్తానీ చర నుండి బయటపడతాడా? లీలా, వరుణ్ లమధ్యన గొడవ సమసిపోయి ఒక్కటవుతారా? అనే విషయాలు తెలియాలంటే వెండితెర మీద చెలియా ని వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు: కార్తీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా వరుణ్ పాత్రలో బాగానే నటించాడు. ఫస్ట్ ఆఫ్ లో కార్తీ నటనకు అద్భుతమైన మార్కులు పడ్డాయి. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కార్తీ కేరెక్టర్ పై ఇంకొంచెం శ్రద్హ పెట్టాల్సింది. క్లైమాక్స్ సన్నివేశాల్లో కార్తీ తన నటనతో మెప్పించాడు. ఇక బాలీవుడ్ నటి అదితి రావ్ మొదటిసారిగా సౌత్ సినిమాలో కనబడింది. ఆమె చెలియా చిత్రంలో చాలా అందంగా కనిపించి అలరించింది. ఎమోషనాల్గా సన్నివేశాలలో అదితి నటన సూపర్బ్ అనిపించింది.కార్తీ, అదితిల మధ్యన రొమాంటిక్ సన్నివేశాలను బాగానే పండినాయి.రుక్మిణి విజయ్ కుమార్, మిలటరీ డాక్టర్‌గా నటించిన ఆర్.జె.బాలాజీ, కల్నల్ పాత్రలో నటించి ఢిల్లీ గణేష్ వారి సహా మిగిలిన అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు: మణి రత్నం చెలియా చిత్రాన్ని ఒక లవ్ స్టోరీ ని కార్గిల్ యుద్ధం తో జోడించి తెరకెక్కించడానికి ప్రయత్నించాడు. కొన్ని చోట్ల మణి అనుకున్న కథకి తాను తీసిన మరికొన్ని సినిమాల్లో సీన్స్ ని కపి కొట్టాడా అని అనిపించక మానదు. ఎమోషనల్ కేరెక్టర్స్ మధ్యన ప్రేమను పండించాలని వారి మధ్యన వచ్చే ఇగో ప్రొబ్లెమ్స్ రెండింటిని బేలెన్స్ చేసే ప్రయత్నం చేసాడు. ఫస్ట్ ఆఫ్ లో కార్తీ పాత్రని చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేసిన మణిరత్నం సెకెండ్ హాఫ్ లో కార్తీ పాత్రని సరిగ్గా డిజైన్ చెయ్యలేకపోయాడు. ఇక సెకండ్ హాఫ్ మరీ స్లో గా ఉండడం ఈ సినిమాకి మైనస్. ఇంకా కామెడీకి ఏమాత్రం చోటు లేకపోవడం కూడా చెలియా చిత్రానికి అతి పెద్ద మైనస్. ఇక సంగీత విషయానికి వస్తే ఏ. ఆర్ రెహ్మాన్ అందించిన బ్యగ్రౌండ్ స్కోర్ సూపర్బ్ అనిపించేలావుంది. ఇక రెండు మూడు పాటల మినహా సంగీతం పెద్దగా ఆకట్టుకునేలా లేదు. చెలియా చిత్రానికి రవి వర్మ సినిమాటోగ్రఫీ ప్రాణం అని చెప్పాలి. ప్రతి విజువల్ చాలా అద్భుతంగా అనిపించింది. కాశ్మీర్, లడక్ లొకేషన్లలో తీసిన కొన్ని సన్నివేశాలను, హీరో హీరోయిన్ల మధ్య నడిచే రొమాంటిక్ సన్నివేశాలను చాలా బాగా చూపించారు. నిర్మాణ విలువలు బాగానే వున్నాయి.
ప్లస్ పాయింట్స్: కార్తీ, అదితి రావ్, బ్యాగ్రౌండ్, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: పాటలు, కథ, కామెడీ, కమర్షియల్ ఎలెమెంట్స్ లేకపోవడం, సెకండ్ హాఫ్, స్లో నేరేషన్
రేటింగ్: 2 .5/5