'తొలిప్రేమ' షార్ట్ & స్వీట్ రివ్యూ
ఫిధా సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ తాజాగా మరో లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన బాబాయ్ పవన్‌కళ్యాణ్ కెరీర్లో మరపురాని చిత్రంగా నిలిచిన తొలిప్రేమ సినిమా టైటిల్‌తోనే వరుణ్ నటించిన ప్రేమకథా చిత్రం తొలిప్రేమ. రాశీఖన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు బీవీఎస్ఎన్.ప్రసాద్ నిర్మాత. కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టాడు. ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. ఇండియాలో శుక్రవారం మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్ సినిమా ఉండడంతో ఆ సినిమాకు పోటీ కాకూడదని తొలిప్రేమను ఇక్కడ శనివారం రిలీజ్ చేస్తున్నా ఓవర్సీస్లో మాత్రం ఓ రోజు ముందుగానే థియేటర్లలో దింపేశారు.
అక్కడ టాక్ ప్రకారం సినిమాకు ఎలా ఉందో చూద్దాం. సినిమా కథను బట్టే సినిమాకు తొలిప్రేమ టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. టీజర్లో చెప్పినట్టు, ప్రేమ కథలు ఎన్ని ఉన్నా మనిషి జీవితంలో తొలి ప్రేమను ఎప్పుడు మరచిపోలేరనే లైన్ ని దర్శకుడు చాలా బాగా చూపించాడు. ఇక ఫస్టాఫ్‌లో కాలేజ్‌లో సరదా సన్నివేశాలు, హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా యూత్ వీటికి బాగా కనెక్ట్ అవుతారు. హీరో వరుణ్, హీరోయిన్ రాశీఖన్నా మధ్య కెమిస్ట్రీ సూపర్బ్‌గా వర్కవుట్ అయ్యింది.
ఫస్టాఫ్‌ను ఎక్కువుగా వైజాగ్ నేపథ్యంలో రన్ చేసిన దర్శకుడు, సెకండాఫ్‌ను ఎక్కువగా లండన్‌లో నడిపించాడు. ముందుగా వరుణ్ - రాశీ ప్రేమించుకోవడం తర్వాత విడిపోవడం, వీరు తిరిగి ఒకే కాలేజ్‌లో జాయిన్ అవ్వడం, మళ్లీ ఒకే చోట ఉద్యోగంలో ఎంటర్ కావడం లాంటి కథనం బాగుంది. మామూలుగా చూస్తే ఇది గొప్ప కథ కాకపోయినా దర్శకుడు కథనాన్ని మంచి ఫీల్‌గుడ్ మూమెంట్లో నడిపించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు.
సినిమాలో వరుణ్ - రాశీతో పాటు మిగిలిన వారు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఎమోషనల్‌గా సినిమా కనెక్ట్ అయ్యింది. ఓవరాల్‌గా యూత్‌కు ఈ సినిమా ప్రేమలో మధురానుభూతులు మిగులుస్తుంది. అయితే మల్టీఫ్లెక్స్, ఏ సెంటర్లకు కనెక్ట్ అయ్యే ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను ఎలా మెప్పిస్తుందన్నది మాత్రం రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.
గుడ్ ఏంటి...
- వరుణ్ - రాశీఖన్నా కెమిస్ట్రీ
- స్క్రీన్ ప్లే
- సినిమాటోగ్రఫీ
- ఎమోషనల్ సీన్లు
- మ్యూజిక్
బ్యాడ్ ఏంటి...
- మెయిన్ స్టోరీ
- అక్కడక్కడా స్లో నెరేషన్
- మాస్కు కనెక్ట్ అయ్యే అంశాలు తక్కువ