'దర్శకుడు' మూవీ రివ్యూ
బ్యానర్: సుకుమార్ రైటింగ్స్
సంగీతం : సాయి కార్తీక్
నిర్మాతలు : సుకుమార్, బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి
దర్శకత్వం : హరి ప్రసాద్ జక్కా
నటీనటులు : అశోక్, ఈషా రెబ్బ, పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్, ప్రియదర్శి తదితరులు
విడుదల తేదీ: 4-08-2017
సెన్సషనల్ దర్శకుడు సుకుమార్ మూవీస్ అంటే ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. ఇప్పటి వరకు చూడని ఏదో ఒకటి కొత్తగా తను ప్రెజంట్ చేస్తాడనే నమ్మకం సుకుమార్ పై వుంది. ఇది దర్శకుడిగా ఆయన గురించి చెప్పుకునేది. మరి నిర్మాతగా చెప్పాలంటే..తను వెనుక ఉండి..కొత్తవారిని ప్రోత్సహిస్తున్న విధానం కూడా ఎంతో ప్రశంసించాల్సిన విషయం. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై 2015 తొలిసారిగా అయన చేసిన ప్రయత్నం కుమారి 21 ఎఫ్ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెండో ప్రయత్నంగా తనకి ఎంతో దగ్గరైన సహచరుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ..నిర్మించిన చిత్రం దర్శకుడు. ఇంకో విషయం ఏమిటంటే ఈ చిత్రం లోని హీరో కూడా తన ఇంటి వాడే కావడం. సరే ఇవన్నీ పక్కన పెడితే..ఈ సినిమా ప్రమోషన్ కోసం సుక్కు..ఇండస్ట్రీ లోని స్టార్స్ ని వాడిన విధానమే ఈ చిత్రాన్ని అడుగడుగునా గుర్తుండేలా చేసింది. ఎన్టీఆర్, రకుల్, సమంత, రామ్ చరణ్, అల్లు అర్జున్..చివరికి మెగాస్టార్ చిరంజీవి ని సైతం సినిమా ప్రమోషన్ కోసం సుక్కు వాడేశాడు. గతంలో బ్రహ్మానందం కూడా తన కొడుకు కోసం ఇలానే వాడి..చివరికి చేతులెత్తేశాడు. కాకపోతే ఇక్కడ వెనుక వున్నది సుకుమార్ కాబట్టి..సినిమాలో కాస్తో కూస్తో విషయం వుండే ఉంటుంది. అది కాక ఇది తమ వృత్తి కి సంబందించిన సినిమా కావడం కూడా ప్రెస్టీజ్ గా తీసుకుని ఉండవచ్చు. సో మొత్తానికి ఎవరిని ఎలా వాడినా.. పరమార్ధం మాత్రం ఒక్కటే కాబట్టి..అసలు ఈ 'దర్శకుడు' కథ ఎంటో చూద్దామా..!
కథ: ఈ ప్రపంచానికి ఓ యువ జంట లవ్ స్టోరీ ని పరిచయం చేయాలనీ తపించి..దాన్నే కలలు కనే మహేష్(అశోక్) కి..అనుకోకుండా డైరెక్టర్ ఛాన్స్ వస్తుంది. ఛాన్స్ రాగానే వెంటనే తను కల కనే స్టోరీ స్క్రిప్ట్ రెడీ చేసుకుని సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. అదే సమయంలో మహేష్ కి కాస్ట్యూమ్ డిజైనర్ నమ్రత (ఈషా రెబ్బ) పరిచయమవుతుంది. ఆ పరిచయంలోనే ఆమెతో ప్రేమలో పడతాడు.కానీ మహేష్ మాత్రం తనలో ఉన్న దర్శకుడి వలన ప్రేమను కూడా సినిమా కోణంలోనే చూస్తుంటాడు. దాంతో హార్ట్ అయిన నమ్రత, మహేష్ కి దూరం కావాలని డిసైడ్ అవుతుంది. అలా ప్రేమను కోల్పోయిన మహేష్ తనకు వచ్చిన డైరెక్షన్ ఛాన్స్ కి కూడా దూరమైపోతాడు. అలా ప్రేమ, సినిమా రెండింటినీ కోల్పోయిన మహేష్ ఎలాంటి బాధ అనుభవించాడు, అసలతను తను ప్రాణం గా భావించే సినిమాకెందుకు దూరమవాల్సి వచ్చింది? అతనిలోని దర్శకుడికి, ప్రేమికుడికి మధ్య జరిగిన సంఘర్షణ ఎటువంటిది అనేదే దర్శకుడి సినిమా కథ.
ఆర్టిస్ట్ ల పనితీరు:సినిమాలో మొదటి నుండి చివరి దాకా ఆకట్టుకునేది హీరో పాత్ర చిత్రీకరణ. ఈ పాత్రలో చేసిన హీరో అశోక్ మొదటి సినిమానే అయినా చాలా బాగా చేశాడు. అతనిది మొదటి సినిమా అంటే ఎవ్వరూ నమ్మరు. బహుశా..ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ సపోర్ట్ అయ్యివుండవచ్చు. కొన్ని సన్నివేశాల్లో అయితే అశోక్ నటన చాలా మ్యేచ్యూర్డ్ గా అనిపించింది. అలాగే హీరోయిన్ ఈషా క్యూట్ గా చాలా బాగుంది. ఆమె సహజమైన నటన అందరికి నచ్చుతుంది. మిగతా పాత్రల్లో పూజిత గ్లామర్ కి ఉపయోగపడితే.. సుదర్శన్, ప్రియదర్శి లో నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా వారంతా ఓకే.
టెక్నిషియన్స్ గురించి చెప్పాలంటే: ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. సాయి కార్తీక్ ఆర్ ఆర్ వినసొంపుగా వుంది. పాటలు మాత్రం అంత క్యాచీగా అనిపించలేదు. సినిమాలో రెండు పాటల పిక్చరైజేషన్ బాగుంది. ఎడిటింగ్ ఓకే. దర్శకత్వ లోపం అడుగడుగునా కనిపించింది. యేవో కొన్ని సీన్లు మినహా..దర్శకుడు ఈ సినిమా కోసం చేసింది ఏం లేదు. సుకుమార్ రైటింగ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ : హీరో పాత్ర చిత్రీకరణ,హీరోయిన్ ఈషా, స్టోరీ,ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్,ప్రియదర్శి కామెడీ
మైనస్ పాయింట్స్ :దర్శకత్వం,కథనం,రొటీన్ సీన్స్,కామెడీ,పాటలు,
వివరణ: ఈ దర్శకుడు చిత్ర దర్శకుడు హరి ప్రసాద్ జక్కా మంచి కథని రాసుకున్నప్పటికీ.. మొదటిసారి దర్శకుడు కావడం అనే లోపం ఈ చిత్రంపై బలంగా కనిపించింది. బలమైన స్క్రీన్ ప్లే, హత్తుకునే సన్నివేశాలు పడి ఉంటే ఈ సినిమా సుకుమార్ రైటింగ్స్ కి మరో మంచి చిత్రం తీశారు అని పేరుని ఇచ్చేది. అలాగే మంచి ఎమోషన్స్ రాబట్టుకోవడంలో కూడా దర్శకుడు విఫలమయ్యాడు. ఈ కథ మంచి దర్శకుడి చేతిలో, స్టార్ హీరోతో పడిఉంటే రికార్డ్స్ వచ్చేవి. అంత మంచి కథ. కానీ దర్శకుడు హరిప్రసాద్ పేలవంగా తెరకెక్కించి..తన లోపం ని బయటపెట్టాడు. అలాగే హీరో కొన్ని బలమైన ఎమోషన్స్ లో తేలిపోయాడు. హీరోయిన్ ఈషా అనుభవం ఈ సినిమాకి బాగా పనికొచ్చింది. ఆమె నటన చాలా సహజంగా వుంది. దర్శకుడే లోపం అయినప్పుడు సాంకేతిక పని భాగంలో ఎవరిని వంక పెట్టాల్సిన అవసరం ఉండదు. సుకుమార్ కథ వరకే పర్యవేక్షణ చేసుంటాడు. మొత్తం హరిప్రసాద్ మీదే వదిలేసి ఉంటాడు. కొంచం పట్టించుకుని ఉంటే..దర్శకుడు రూపం మరోలా ఉండేది. సుకుమార్ రైటింగ్స్ కి ఈ దర్శకుడు వల్ల ఒరిగేది ఏమి లేదు. ఇక ఆ బ్యానర్ పేరు ఎక్కడ వాడాలన్న కుమారి 21 ఎఫ్ గురించే చెప్పుకోవాలి తప్ప దర్శకుడు గురించి మాట్లాడకుండా ఉంటేనే బెటర్.
ఫైనల్ వర్డ్: దర్శకుడే లోపమిక్కడ..!
రేటింగ్: 2.5/5