Tue Nov 26 2024 02:17:31 GMT+0000 (Coordinated Universal Time)
భేతాళుడు మూవీ రివ్యూ
నటీనటులు: విజయ్ ఆంటోనీ, అరుంధతి నాయర్
మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ ఆంటోనీ
నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోనీ
దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తి
'నకిలీ, సలీం, బిచ్చగాడు' వంటి డిఫరెంట్ చిత్రాలతో అటు తమిళం లో, ఇటు తెలుగులో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో విజయ ఆంటోని ఇప్పుడు 'భేతాళుడు'తో ప్రేక్షకులను పలకరించడానికి వచ్చేసాడు. ఈ 'భేతాళుడు' సినిమాకి పబ్లిసిటీగా ఒక వెరైటీ మార్గాన్ని ఎంచుకున్న భేతాళుడు టీమ్ ఈ చిత్రాన్ని మొదటి 10 నిముషాలు యూట్యూబ్ లో పెట్టేసారు. ఇక ఆ 10 నిమిషాలతో విజయ్ ఆంటోని నటనతో అందరిని కట్టిపడేసి... సినిమాపై భారీ అంచనాలు పెంచేసాడు. అందులోను విజయ్ ఆంటోని 'బిచ్చగాడు' సినిమాతో తెలుగులోకి సైలెంటుగా వచ్చి కోట్లు కొల్లగొట్టుకుపోయాడు. ఇక 'బిచ్చగాడు' తర్వాత వచ్చే ఈ భేతాళుడు'పై కూడా మంచి అంచనాలు ఏర్పడేలా చేశారు. మరి ట్రైలర్లోనూ, పోస్టర్స్ లోను సైకలాజికల్ థ్రిల్లర్ గా చూపించి ఆసక్తి రేకెత్తించిన 'భేతాళుడు' ఈ రోజు ఒకేసారి తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి విజయ్ ఆంటోని 'బిచ్చగాడి'తో ఆకట్టుకున్నట్టు 'భేతాళుడు'గా కూడా ఏమేరకు మెప్పించాడో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: దినేష్(విజయ్ ఆంటోనీ) ఒక ఐటి ఉద్యోగి. సాఫ్ట్ వెర్ ఇంజినీర్ గా పని చేస్తున్న దినేష్ ఒక మానసిక వ్యాధి బారిన పడతాడు. గత జన్మ జ్ఞాపకాలతో నిత్యం సతమతమవుతుంటాడు. ఎవరో తనని చంపుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే మానసిక రుగ్మత ట్రీట్మెంట్ కోసం దినేష్ ఒక డాక్టర్ ని కలుస్తాడు. ఆ డాక్టర్ దినేష్ ని హిప్నటైజ్ చేసి అతను ఎందుచేత బాధిపబడుతున్నాడో కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. దినేష్ గత జన్మలో పరిచయమున్న జయలక్ష్మి అనే మహిళ కోసం వెతుకుతూ పిచ్చివాడిగా తిరుగుతూ ఉంటాడు. ఇక దినేషుని ఆ మానసిక వ్యాధి నుండి బయట పడెయ్యడానికి అతని భార్య అరుంధతి నాయర్ అతనికి సహాయం చేస్తుంది. అసలు దినేష్ గత జన్మ కథేమిటి? జయలక్ష్మికి దినేష్ కి వున్న సంబంధం ఏమిటి? డాక్టర్ దినేష్ కి నయం చేస్తాడా? దినేష్ భార్య దినేష్ కి ఏవిధం గా సహాయం చేసింది? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
పనితీరు: బిచ్చగాడి తో నటనని పీక్ స్టేజి కి తీసుకెళ్లిన విజయ్ ఆంటోని భేతాళుడులో కూడా దినేష్ పాత్రకి తగిన న్యాయం చేసాడు. విజయ ఆంటోని నటన గురించి ఎంత పొగిడినా తక్కువే అనిపించేలా చేసాడు. మానసిక వ్యాధి బారిన పడిన వ్యక్తి ఏ విధమైన సమస్యలతో బాధపడతాడో అచ్చం అలానే విజయ్ కనిపించాడు. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఆసక్తి కరం గా మొదలవుతుంది. ఇంటర్వెల్ బాంగ్ అదర గొట్టేసాడు. ఇక దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి గురించి చెప్పాలంటే మంచి థ్రిల్లర్ కథని ఎంచుకుని మంచి స్క్రీన్ ప్లే తో సినిమాని తెరకెక్కించాడు. దర్శకుడు మేకింగ్ లో మంచి ప్రతిభ కనపరిచాడు. ముఖ్యంగా విజయ్ ని చూపించడంలో వంద శాతం సఫలమయ్యాడు.. కథ విషయంలో జాగ్రత్త వహించిన దర్శకుడు దాన్ని ప్రెసెంట్ చేసే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది. స్టోరీ అంత స్లో నరేషన్ గా సాగి అక్కడక్కడ బోర్ కొట్టే విధంగా ఉంది..ఇంటర్వెల్ సస్పెన్సు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇక ఈ సినిమాకి మెయిన్ హైలైట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. మ్యూజిక్ డైరెక్టర్ గా అందరికి పరిచయమైనా విజయ్ ఆంటోనీ ఈ సినిమాకి మ్యూజిక్ అందించడం విశేషం.. పైగా తాను నటిస్తున్న సినిమా కావడంతో ఇంకాస్త శ్రద్ధ పెట్టి మ్యూజిక్ చేసాడని సినిమాలో వచ్చే ఆర్.ఆర్ చెప్తుంది.. ఎడిటర్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. నిర్మాణ విలువలు బావున్నాయి.
ప్లస్ పాయింట్స్ : విజయ్ ఆంటోనీ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ట్విస్ట్స్
మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్, కమర్షియల్ ఎలెమెంట్స్, కామెడీ, క్లైమాక్స్
రేటింగ్ 2 .75 /5
Next Story