Thu Dec 26 2024 12:56:52 GMT+0000 (Coordinated Universal Time)
"అఖండ" ఎలా ఉందంటే?
నందమూరి బాలకృష్ణ నటించిన, బోయపాటి డైరెక్షన్ లో రూపొందిన అఖండ సినిమా నేడు విడుదల కానుంది.
నందమూరి బాలకృష్ణ నటించిన, బోయపాటి డైరెక్షన్ లో రూపొందిన అఖండ సినిమా నేడు విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీపై రివ్యూలు వచ్చేస్తున్నాయి. బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య సినిమా కావడంతో అఖండ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సింహ, లెజెండ్ తర్వాత మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన కొందరు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
ఇంటర్వెల్ కు ముందు....
అఘోరా పాత్రలో బాలయ్య అమోఘంగా నటించారని ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలయ్య యాక్షన్ ఈ సినిమాకు హైలెట్ అని, ఇంటర్వెల్ కు ముందు, క్లైమాక్స్ లను దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారని చెబుతున్నారు. అఖండ సినిమా బాలయ్య బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ మూవీగా పడిపోయినట్లేనని నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Next Story