Fri Nov 22 2024 18:02:43 GMT+0000 (Coordinated Universal Time)
బంగార్రాజు రివ్యూ.. అక్కినేని సోగ్గాళ్ల ప్రయత్నం ఫలించిందా ?
‘బంగార్రాజు’ కొడుకు డాక్టర్ రాము (నాగార్జున) భార్య సీత (లావణ్య త్రిపాఠి) ఓ బాబుకి జన్మనిచ్చి కన్నుమూస్తుంది. దీంతో శివపురంలో ఉంటే
అక్కినేని సోగ్గాళ్లు.. కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య కలిసి నటించిన సినిమా బంగార్రాజు. సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా జనవరి 14వ తేదీన థియేటర్లలో విడుదలైంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి ప్రీక్వెల్ గా.. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి ఫీమేల్ లీడ్స్ లో నటించారు. బంగార్రాజు సినిమాను జీ5 సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున నిర్మించారు.
గతేడాది ఆగస్టులో మొదలైన బంగార్రాజు షూటింగ్.. అనుకున్న సమయానికి పూర్తి చేసి.. ప్లాన్ ప్రకారం 2022 సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకొచ్చారు నాగ్. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు తప్పుకున్నాయి కాబట్టి బంగార్రాజు విడుదలైంది అనుకుంటే పొరపాటే. ఆ సినిమాలు వచ్చినా.. బంగార్రాజు సైడ్ అయ్యేవాడు కాదు. కానీ.. పాన్ ఇండియా సినిమాలు తప్పుకోవడం వల్ల బంగార్రాజు కలెక్షన్స్ కి కాస్త లైన్ క్లియర్ అయిందని చెప్పాలి. మరి సంక్రాంతి కానుకగా వచ్చిన బంగార్రాజు.. ప్రేక్షకులను మెప్పించాడా ? సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిందా? తెలుసుకోవాలంటే.. కథలోకి వెళ్లాలి.
కథేంటంటే..
'బంగార్రాజు' కొడుకు డాక్టర్ రాము (నాగార్జున) భార్య సీత (లావణ్య త్రిపాఠి) ఓ బాబుకి జన్మనిచ్చి కన్నుమూస్తుంది. దీంతో శివపురంలో ఉంటే భార్య జ్ఞాపకాలు వెంటాడుతుంటాయని, నా కొడుకుని నువ్వే పెంచు, నేను అమెరికా వెళ్లిపోతాను. అప్పుడప్పుడు వచ్చి కొడుకుని చూస్తానని అమ్మ సత్యభామ (రమ్యకృష్ణ) కి చెప్పి వెళ్లిపోతాడు రాము. భర్త మీద ప్రేమతో మనవడి (నాగ చైతన్య) కి 'బంగార్రాజు' అని పేరు పెడతుంది సత్యభామ. పేరు మాత్రమే కాదు పోలికలు కూడా తాతవే వస్తాయి. మీసాలు రాకుండానే సరసాలు మొదలెడతాడు బుల్లి బంగార్రాజు. హత్య చేయబడి నరకానికి వెళ్లిన 'బంగార్రాజు' (నాగార్జున)ని యముడు స్వర్గంలోకి అనుమతిస్తాడు. శివపురానికి ఆపద సంభవించబోతోందని, దాన్ని ఆపాలంటే 'బంగార్రాజు' భూలోకానికి వెళ్లాల్సిందేనని ఇంద్రుడితో చర్చించి అతణ్ణి భూలోకానికి పంపుతాడు యముడు.
Also Read : మెగా భోగి సంబరాలు.. వరుణ్ తో "చిరు" అల్లరి
చదువు పూర్తి చేసి స్నేహితులతో సరదాగా గడుపుతుంటాడు 'బంగార్రాజు'. చిన్నప్పుడే మామ కూతురు నాగలక్ష్మి (కృతి శెట్టి) తో 'బంగార్రాజు' పెళ్లి చెయ్యాలని నానమ్మ నిర్ణయించుకుంటుంది. అయితే బావా మరదళ్లైన 'బంగార్రాజు', నాగలక్ష్మిలకు ఒక్క క్షణం కూడా పడదు. తాను తెలివిగలదాన్ననుకునే నాగలక్ష్మీ శివపురానికి సర్పంచ్ అవుతుంది. భూలోకానికి ఆత్మగా వచ్చిన 'బంగార్రాజు' (నాగార్జున), మనవడిలోకి ప్రవేశించి అతణ్ణి కాపాడుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో 'బంగార్రాజు', నాగలక్ష్మిల మధ్య విబేధాలు తలెత్తుతాయి. ఇంతకీ వాళ్లిద్దరికీ పెళ్లి జరిగిందా? యముడు, 'బంగార్రాజు' ని ఎందుకు భూమ్మీదకు పంపాడు? చనిపోయి స్వర్గానికి వెళ్లిన సత్యభామ (రమ్యకృష్ణ) తిరిగి భూమ్మీదకి ఎందుకువచ్చింది? బంగార్రాజు, సత్యభామ కలిసి మనవడికి పెళ్లి జరిపించారా? బంగార్రాజు కొడుకు రాము తిరిగి వచ్చాడా, లేదా? అసలు బంగార్రాజుని ఎవరు, ఎందుకు చంపాలనుకున్నారు? అనేది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే..
నాగార్జున నటన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది. బంగార్రాజు క్యారెక్టర్ లో నాగ్ జీవించేశారు. బంగార్రాజుగా మరోసారి ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. ఇక నాగచైతన్య కూడా తనకిచ్చిన క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ కొత్తగా అనిపిస్తాయి. సత్యభామగా రమ్యకృష్ణ తన నటనతో ఆకట్టుకున్నారు. విలేజ్ యువతిగా, యంగ్ సర్పంచ్గా నటనతో పాటు క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా చేసింది. మిగతా నటీనటులంతా.. తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. ఫరియా అబ్దుల్లా ఐటెం సాంగ్ లో ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారుకు కిర్రెక్కించింది.
బలాలు
- నాగార్జున
- పాటలు
- అభిమానుల్ని ఆకట్టుకునే సన్నివేశాలు
- అనూప్ మ్యూజిక్
బలహీనతలు
- ఊహకందే కథ, కథనాలు
- ఊహించిన మేర కామెడీ పండకపోవడం
చివరిగా.. బంగార్రాజు పండగ లాంటి సినిమా. ఈ పండక్కి ఫ్యామిలీతో కలిసి చూడగలిగే సినిమా.
News Summary - Bangarraju Movie Full Review
Next Story