Mon Dec 23 2024 09:55:20 GMT+0000 (Coordinated Universal Time)
బంగార్రాజు ట్విట్టర్ రివ్యూ.. సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిందా ?
బంగార్రాజు సినిమా ఫస్ట్ ప్రీమియర్ పూర్తయింది. ప్రీమియర్ చూసిన ఆడియన్స్ సినిమాపై తమ అభిప్రాయాన్ని
చాలాకాలం తర్వాత నాగార్జున - నాగ చైతన్య కలిసి నటించిన సినిమా బంగార్రాజు. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ గా వచ్చింది ఈ సినిమా. అప్పుడు కూడా సోగ్గాడే చిన్నినాయనా సంక్రాంతికే విడుదలై.. భారీ హిట్ కొట్టింది. ఆ సెంటిమెంట్ తోనే బంగార్రాజును కూడా సంక్రాంతికే విడుదల చేశారు మేకర్స్. జనవరి 14, శుక్రవారం బంగార్రాజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొత్తం 1300 థియేటర్లలో సినిమా విడుదలవ్వగా.. నాగ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ ఇదేనని టాక్. మరి ప్రీమియర్ షో తర్వాత బంగార్రాజు టాక్ ఎలా ఉంది ? బంగార్రాజు అందరినీ మెప్పించాడా ? సినిమా హిట్ అవుతుందా ? అన్న విషయాలు తెలుసుకుందాం.
Also Read : పవన్ ఎప్పుడూ ఒంటరేనా? ఫ్యామిలీ ఈసారీ దూరమేనా?
బంగార్రాజు సినిమా ఫస్ట్ ప్రీమియర్ పూర్తయింది. ప్రీమియర్ చూసిన ఆడియన్స్ సినిమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. కొందరు సినిమా సూపర్ డూపర్ హిట్ అంటే.. మరి కొందరు మాత్రం బంగార్రాజు బాగా నిరాశపరిచాడని చెప్తున్నారు. కావాలనే నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆడియన్స్ రివ్యూ ప్రకారం.. కథేంటంటే.. సోగ్గాడే చిన్నినాయనా సినిమా క్లైమాక్స్ తర్వాత నుంచి సినిమా మొదలవుతుంది. ఓపెనింగ్ లో శివాలయం, యముడిగా నాగబాబు ఎంట్రీ, అక్కడ నాగబాబు చెప్పే కొన్నివిషయాలు కనిపిస్తాయి. తర్వాత నాగచైతన్య జననం.. అతని బాల్యం, పెద్దయ్యాక చేసే పనులు ఇవన్నీ ఫస్టాఫ్ లో కనిపిస్తాయి. నాగచైతన్య నాగార్జునకు మనుమడిగా పుడతాడు. అందుకే సోగ్గాడు మళ్లీ పుట్టాడన్న ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఇక తాత లాగానే.. మనుమడు కూడా ఊర్లో ఉన్న అమ్మాయిలతో సరసాలాడుతూ ఉంటాడు. ఇంతలో హీరోయిన్ ఎంట్రీ. సర్పంచ్ గా కనిపించే కృతిశెట్టితో బంగార్రాజు ప్రేమలో పడతాడు. వాళ్లిద్దరినీ ఎలాగైనా కలపాలని ప్రయత్నిస్తుంటారు రమ్యకృష్ణ - నాగార్జున.
ఫరియా అబ్దుల్లా ఐటెంసాంగ్, నాకోసం మారావా నువ్వు పాటలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఫస్టాఫ్ అంతా కాస్త కామెడీగా సాగినా.. ఊహించని ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. సెకండాఫ్ లో కథ కాస్త సీరియస్ గానే ఉంటుంది. శివాలయం చుట్టూ తిరిగే కథలో నాగచైతన్య పాత్ర ఏంటి ? తాత, మనుమడు కలిసి చేసిన హంగామా..క్లైమాక్స్ సినిమాను ఓ మలుపు తిప్పుతాయని ఆడియన్స్ చెప్తున్నారు. మొత్తానికి బంగార్రాజు ఈ సంక్రాంతికి అవుట్ అండ్ అవుట్ బ్లాక్ బస్టర్ అని టాక్ వినిపిస్తోంది. సినిమా పూర్తి రివ్యూ తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే..
Next Story