ఆడియో రివ్యూ: 'భరత్ అనే నేను'
టైటిల్: భరత్ అనే నేను
నటీనటులు: మహేష్‌బాబు, కైరా అద్వానీ తదితరులు
నిర్మాత: డీవీవీ. దానయ్య
దర్శకత్వం: కొరటాల శివ
మ్యూజిక్: దేవిశ్రీప్రసాద్
పాటలు: 5
ఆడియో ఆల్బమ్ నిడివి: 24.33 నిమిషాలు
1వ సాంగ్: భరత్ అనే నేను
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సింగర్: డేవిడ్ సిమోన్
సినిమాలో మహేష్‌బాబు సీఎం క్యారెక్టర్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు క్యారెక్టర్ ఎలా ఉంటుందో ? చెపుతూ వచ్చే సాంగ్ ఇది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను సింగర్ డేవిడ్ సిమోన్ మోడ్రన్‌గా స్టైలీష్‌గా పాడాడు. పాటలో సాహిత్యం ఎంత బలంగా ఉందో పాడిన తీరు కూడా అంతే బాగుంది. టోటల్ ఆల్బమ్‌లో ఈ సాంగ్‌ను పదే పదే వింటున్నారు. భరత్ అనే నేను... హామీ ఇస్తున్నాను.... బాధ్యుడినై ఉంటాను... నలుపెరగని సేవే అభిమతం... నీలదీస్తా నేనే.. కష్టం ఏదైనా సమ్మతం ఇలా పాట రాసిన తీరు బాగుంది. పాలించే ప్రభువును కాదని... సేవించే బంటును నేను అధికారం అర్థం ఇదని.... తెలిసేలా చేస్తా నా పని ఇలా సాహిత్యంలో అర్థం హీరో క్యారెక్టర్ ఏంటో చెప్పకనే చెప్పేసింది.
ఇక సాంగ్‌కు దేవిశ్రీ వాటిన ట్యూన్, కీ బోర్డ్‌తో పాటు ఇతర ఇన్స్ట్రుమెంట్స్, కోరస్ అన్నీ అలా సెట్ అయ్యాయి. పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది.
2వ సాంగ్: ఐ డోంట్ నో
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సింగర్: ఫర్హాన్ అక్తర్
హెలెలెలే భామా... హోయిలా... లెలెలె లెలీగో ఐ డోన్ట్ నో అనే సాగే ఈ పాట ఎక్కువుగా ఇంగ్లీష్ పదాలతో ఉంది.
ఎందుకో మరి ఒంటిమీద శారి... చెంగుమంది చేప నీటి నుంచి జారీ... కొత్త గాలిలో కొత్త సంగతేంటో తెలుసు కుంటానికేమో లాంటి కూర్పు బాగుంది. కంటిముందు ఉన్న అద్భుతాలు ఎన్నో.... వాటి ముందు ఉన్న మిస్టరీలు ఎన్నో... ఇంతకాలం చూసి చూడకుండా ఎందుకు వదిలేశాను ఇలా సాంగ్ కొనసాగుతుంది. ఓ విధంగా చెప్పాలంటే హీరోయిన్‌తో హీరో ప్రేమ విషయంలో వచ్చే సాంగ్‌గా ఈ సాంగ్ ఉంటుందని స్పష్టమవుతోంది. పాట మధ్యలో వచ్చే కీ బోర్డ్ థీమ్ సాంగ్‌కు హైలెట్. ఈ థీమ్ హత్తుకునేలా ఉంది. బాలీవుడ్ సింగర్ పర్భాన్ అక్తర్ బాగా పాడాడు.
3వ సాంగ్: ముసలి తాతా ముడత మొఖం మురిసి పోయెనే...... వచ్చాడయ్యో సామి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సింగర్: కైలాష్ ఖేర్, దివ్య కుమార్
దర్శకుడు కొరటాల శివ ప్రతి సినిమాలోనూ హీరోపై ఓ స్పెషల్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాల్లోనూ ఈ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ క్రమంలోనే హీరో జనాలకు ఏం చేస్తాడనే దానిమీద ఓ హామీలా ఉండే సాంగ్ ఇది. ఇదే స్టైల్ సాంగ్‌ను ఇందులోనూ కంటిన్యూ చేశాడు. హీరో గొప్పతనంతో పాటు అతడు చేసే మంచి పనులను వివరిస్తూ వచ్చే సాంగ్ ఇది. వచ్చాడయ్యో సామి.. నింగి చుక్కల్లో పరిగెత్తిందే భూమి... ఇచ్చాడయ్యో సామి... కొత్త రెక్కలను మెలకెత్తించే హామీ అంటూ స్టార్టయ్యే సాంగ్ బాగుంది. కత్తి సుత్తి, పలుగు, పారా తీయండి..ఆ కష్టం, సుఖం కుంకుమ బొట్టుగ పెట్టండి.. అన్నం పెట్టే పనిముట్లే దేవుళ్లు... మట్టిగోడలు చెపుతాయి సీమ మనుషుల కష్టాలు... ఇలా మంచి అర్థం వచ్చే పదాలతో రామజోగయ్య శాస్త్రి పదాల కూర్పు బలంగా ఉండి అర్థవంతంగా ఉంది. దేవిశ్రీ ఓ రణరంగానికి సిద్ధమవుతోన్న టైప్ మ్యూజిక్‌తో పాటు భావోద్వేగానికి సెట్ అయ్యే థీమ్‌ను వాడాడు. ఇక సాంగ్‌లో రైతులు, జనాలు ఎలా ఉంటారనేది కూడా బాగా చెప్పారు. పల్లెటూర్లు పట్టుగొమ్మలు అనేదే ఈ పాట చెప్పింది.
4వ సాంగ్: ఇదే కలలా ఉన్నదే
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సింగర్: ఆండ్రియా జెమీనా
నానననననన నానా నననన అరెయే ఇది కలలా ఉందే... అయ్యయో కాని జరిగిన నిజమిదే అంటూ స్టార్టయ్యే ఈ పాట ఓ మామూలు రొమాంటిక్ ట్రాక్ నేపథ్యంలో వచ్చే సాంగ్. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ కైరా హీరోను ప్రేమించేటప్పుడో లేదా ప్రేమిస్తూ ఊహించుకుంటున్న టైంలోనే ఈ సాంగ్ వస్తుందని సాంగ్ చెప్పేస్తోంది. పదాలు అంత కొత్తగా లేవు....దేవిశ్రీ మ్యూజిక్ యావరేజ్. అయితే ఆండ్రియా మాత్రం తన వాయిస్‌తో ఎట్రాక్ట్ చేసేందుకు.... సాంగ్‌కు ఊపు ఇచ్చేందుకు ట్రై చేసింది. సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా డౌన్ కాకుండా ఒకే గ్రాఫ్‌తో ఉంది. మధ్యలో దేవి వాడిన థీమ్‌లు కూడా గత సినిమాల్లో విన్నట్టే ఉంటాయి. ట్యూన్ కూడా పాత స్టైల్లోనే ఉంది.
5వ సాంగ్: ఓ వసుమతి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సింగర్: యాజిన్ నిజర్, రిత
దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా వసుమతి.... ఓ ఓ వసుమతి ప్రేమ కవితల షల్లీల పారిపోయా నీ వల్ల అంటూ స్టార్టయ్యే ఈ సాంగ్ హీరో - హీరోయిన్ల మధ్య రొమాంటిక్ డ్యూయెట్. ఈ పాట కూడా సింపుల్ స్టెప్లకు స్కోప్ ఉన్న సాంగ్. మరీ అంత కొత్తగా లేదు... రామజోగయ్య పదాలు జస్ట్ ఓకే. అయితే దేవి సాంగ్ మధ్యలో ఇచ్చిన మ్యూజిక్ థీమ్‌కు కొత్త కలరింగ్ ఇచ్చినట్లుంది. మధ్యలో ఓ థీమ్ అయితే గత సినిమాల నుంచి ఎత్తేసినట్టే ఉంది. ఈ సాంగ్ యావరేజ్.
ఫైనల్ తీర్పు :
మహేష్‌బాబు - దేవిశ్రీ ప్రసాద్ - కొరటాల శివ కాంబినేషన్ అనగానే సినిమాతో పాటు అల్బమ్పై కూడా మంచి అంచనాలు ఉంటాయి. ఇక భరత్ అను నేను ఆల్బమ్ విషయానికి వస్తే ఆల్బమ్ మొత్తానికే భరత్ అనే నేను హైలెట్. ఈ పాట పదే పదే వినాలనిపిస్తోంది. ఆ తర్వాత ఐ డోన్ట్ నో, వచ్చాడయ్యో సామి పాటలు బాగున్నాయి. ఇది కలలా ఉన్నదే, వసుమతి పాటలు యావరేజ్. ఐదు పాటల్లో హీరో ఇంట్రడక్షన్ మీద, హీరో క్యారెక్టరైజేషన్ మీద, రొమాంటిక్ సాంగ్స్ అన్ని ఉన్నాయి. ఓవరాల్‌గా అల్బమ్ పర్వాలేదనిపించింది. గతంలో ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన శ్రీమంతుడు రేంజ్లో మాత్రం ఈ అల్బమ్ లేదనే చెప్పాలి.
'భరత్ అనే నేను' ఆల్బమ్ తెలుగుపోస్ట్.కామ్ రేటింగ్: 3 / 5