బందోబస్త్ మూవీ రివ్యూ
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్ నటీనటులు: సూర్య, మోహన్‌లాల్, ఆర్య, సయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు తదితరులు ఎడిటర్: ఆంటోని సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్.ప్రభు సంగీతం: హేరీష్ జైరాజ్ [more]
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్ నటీనటులు: సూర్య, మోహన్‌లాల్, ఆర్య, సయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు తదితరులు ఎడిటర్: ఆంటోని సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్.ప్రభు సంగీతం: హేరీష్ జైరాజ్ [more]
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
నటీనటులు: సూర్య, మోహన్‌లాల్, ఆర్య, సయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు తదితరులు
ఎడిటర్: ఆంటోని
సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్.ప్రభు
సంగీతం: హేరీష్ జైరాజ్
నిర్మాత: సుభాస్కరన్
దర్శకత్వం: కె.వి.ఆనంద్
కోలీవుడ్ హీరో సూర్య సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. సూర్య సినిమా అంటే మాస్ ప్రేక్షకులు ముచ్చటపడతారు. గజినీ, సింగం సీరీస్ తో సూర్య తెలుగులో మంచి మర్కెట్ ని సెట్ చేసుకున్నాడు. గత ఏడాది నుంచి సూర్య సినిమాల్లో ఎక్కడా పస కనిపించడం లేదు, గ్యాంగ్, ఎన్జీకే సినిమాలు సూర్య ఎందుకు చేసాడో కూడా తెలియదు. ఆ సినిమాల్తో మార్కెట్ కోల్పోయిన సూర్య తనకు బ్రదర్ లాంటి హిట్ ఇచ్చిన సుభాస్కరన్ తో బందోబస్త్ సినిమా చేసాడు. బందోబస్త్ తమిళంలో కప్పాన్ గా విడుదలయ్యింది. మరి ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, తమిళ హీరో ఆర్య లాంటి స్టార్స్ నటించడంతో సినిమా మీద మంచి ఆసక్తి ఏర్పడింది. సూర్య బందోబస్త్ తో ఎలాంటి హిట్ అందుకున్నాడో సమీక్షలో చూసేద్దాం.
కథ:
రవి కిషోర్ (సూర్య) ఒక పవర్ ఫుల్ ఆఫీసర్. సీక్రెట్ ఆపరేషన్స్ లో భాగంగా తన డ్యూటీ చేస్తూ.. భారత ప్రధాని చంద్రకాంత్ వర్మకి (మోహన్ లాల్) దగ్గర అవుతాడు. చంద్రకాంత్ వర్మ ప్రధానిగా ప్రజల మేలు కోరే స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు. నిజాయితీ గల ప్రధానిగా దేశాన్నీ పట్టి పీడిస్తున్న చెడు పై యాక్షన్ తీసుకోవటానికి వెనుకాడని వాడు. ఆ క్రమంలోనే ప్రధాని కి శత్రువులు ఎక్కువవుతారు. ప్రధాని చంద్రకాంత్ కి ఉన్న థ్రెడ్ వలన ఆయనకి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా రవి కిషోర్ (సూర్య) నియమించబడతాడు. ఈ క్రమంలో ప్రధాని చంద్రకాంత్ పిఏ అంజలి (సయేషా సైగల్)తో రవి కిషోర్ ప్రేమలో పడతాడు. అనుకోకుండా ఉగ్రవాదుల పేరుతొ జరిగిన దాడిలో ప్రధాని చంద్రకాంత్ వర్మ చనిపోతారు. ఆ తరువాత చంద్రకాంత్ ప్లేస్ లోకి ఆయన కొడుకు(ఆర్య) ప్రధాని పదవిని చేపడతాడు. అసలు ప్రధాని చంద్రకాంత్ ని చంపింది ఎవరు ? ఆ మర్డర్ వెనుకున్న రహస్యాన్ని చేధించడానికి రవి కిషోర్ ఏమి చేశాడు? ఇంతకీ మహావీర్ (బోమన్ ఇరానీ) ప్రధాని హత్యకి సంబంధం ఏమిటి? తండ్రి చంద్రకాంత్ చావుకి ఆయన కొడుకు ఆర్యా కి ఉన్న సంబంధం ఏమిటి? చివరికి రవి కిషోర్ అసలు నిందితులను పట్టుకున్నాడా? అనేది మిగతా కథ.
నటీనటుల నటన:
రవి కిషోర్ గా ఆఫీసర్ పాత్రలో సూర్య నటన బావుంది. స్టైలిష్ ఆఫీసర్ గా ఎప్పటిలాగా సూర్య నటన సూపర్ గా ఉంది. తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ తన యాక్టింగ్ తో సినిమాలో సీరియస్ నెస్ తో పాటు ఇంట్రస్ట్ ను కూడా బాగా మెయింటైన్ చేశాడు. ఇక పీఎం చంద్రకాంత్ వర్మ పాత్రలో మోహన్ లాల్ తన నటనతో అదరగొట్టెయ్యడమే కాదు… ఈ సినిమాలో ఉత్తమమైన నటనను కనబర్చారనె చెప్పాలి. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో మోహన్ లాల్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇక పీఎం పిఏ గా సయేశా పర్వాలేదనిపించింది. కాకపోతే సయేశా పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. మూడు పాటలు, నాలుగు సీన్స్ అన్నట్టుగా అంది. ఇక మోహన్ లాల్ కొడుకు పాత్రలో ఆర్య నటన బావుంది. బొమ్మన్ ఇరానీ విలన్ పాత్రలో మెప్పించాడు. మిగతా నటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కొన్ని సన్నివేశాల్లో ఆసక్తికరంగా సాగుతుంది. బందోబస్త్ ఫస్ట్ హాఫ్ లో సూర్య చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరియు అందుకు తగ్గట్టుగా కథనం కూడా ఆసక్తికరంగా కొనసాగుతుంది.అంతే కాకుండా యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ సెకండాఫ్ పై మరింత ఆసక్తి కలిగించేలా చేస్తుంది.అయితే సెకండాఫ్ కూడా ఫస్టాఫ్ లా ఒక ఫ్లో లో అలా మొదలవుతుంది కానీ అలా అలా కాస్త కథనం నెమ్మదించిన భావన ప్రేక్షకుడికి కలుగుతుంది స్టోరీ లైన్ బాగానే ఉంది కానీ దాన్ని సెకండాఫ్ కి వచ్చేసరికి మాత్రం డల్ చేసేశారు. ఈ విషయంలో ఇంకాస్త ఆసక్తికరంగా మలచి ఉంటే బాగుండేది. సెకెండాఫ్ లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగాతీశారు. అసలు సినిమా మొదలైన చాల సమయానికి గాని ప్రేక్షకులకు సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ పై ఒక క్లారిటీ రాదు. అలాగే హీరోకి హీరోయిన్లకు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా కథకు అనవసరం అనిపిస్తాయి. అలాగే సూర్య కెరీర్ లో ఇప్పటికే చూసిన ఎన్నో సినిమాలను అన్ని కలిపి ఈ చిత్రంలో చూసినట్టుగా అనిపిస్తుంది. అంతే కాకుండా సినిమా మొదలైన దగ్గర నుంచి కాస్త ఎంటెర్టైనమెంట్ పాళ్ళు ఏమి లేకుండా సీరియస్ గా ఎలాంటి కామెడీ లేకపోవడం అన్ని వర్గాల ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. అలాగే కొన్ని చోట్ల పేలవమైన కథనం, ప్రీ క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి.
సాంకేతికంగా…
హరీష్ జై రాజ్ పాటలు అంతగా ఎక్కకపోయినా.. ఆయన నేపధ్య సంగీతం బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ స్ లో నేపథ్య సంగీతం చాల బాగుంది. ఎం ఎస్ ప్రభు సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. ఇక ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. నిర్మాణ విలువలు కథానుసారంగా ఉన్నాయి.
రేటింగ్: 2.5/5