హ్యాపీ వెడ్డింగ్ మూవీ రివ్యూ
బ్యానర్: యూవీ క్రియేషన్స్
నటీనటులు: నిహారిక, సుమంత్ అశ్విన్, నరేష్, మురళి శర్మ, రాజా, పవిత్ర లోకేష్, ఇంద్రజ, తులసి, అన్నపూర్ణమ్మ తదితరులు
మ్యూజిక్: శక్తికాంత్ కార్తిక్
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
నిర్మాత: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణ రెడ్డి
దర్శకత్వం: లక్ష్మణ్ కార్య
'ఒకమనసు' సినిమాలో ట్రెడిషనల్ పంజాబీ డ్రెస్సులతో.. నిండైన చీర కట్టుతో మెప్పించిన నిహారిక కొణిదెల.. కు మళ్ళీ తెలుగులో ఛాన్స్ రాకపోవడానికి రెండే రెండు కారణాలు. ఆమెకు అవకాశం ఇవ్వాలి అంటే ఆ సినిమా చాలా క్లిన్ గా నీట్ గా ఉండాలి. ఎలాంటి గ్లామర్ కానీ...వల్గారిటీకి చోటుండకూడదు. మరో కారణం నిహారిక కొణిదెల మెగా డాటర్ కావడం. ఇంకా నిహారికలా ట్రెడిషనల్ గా పద్దతిగా కనబడితే తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఒప్పుకోరు. హీరోయిన్ అంటే గ్లామర్ షో చెయ్యాలి, పాటల్లో డాన్స్ లు ఇరగ దియ్యాలి. అలాగే స్టార్ హీరోల పక్కన అయితేనే హీరోయిన్ మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండేది. అందుకే నిహారిక రెండో తెలుగు సినిమా చెయ్యడానికి అంత గ్యాప్ తీసుకుంది. కానీ తెలుగులో ఆఫర్స్ రాకపోయినా నిహారిక తమిళంలో తనని తానూ ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళింది. మొదటి సినిమా నాగ శౌర్య తో చేసిన నిహారిక రెండో సినిమాని నిర్మాత ఎం ఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ సినిమాలో నటించింది. ఈ సినిమాని లక్ష్మణ్ కార్య పూర్తి కుటుంబ నేపథ్యంలో తెరకెక్కించాడు. పెళ్లి లో పెళ్లి కూతురు కుటుంబం వాళ్ళు, పెళ్లి కొడుకు కుటుంబం వాళ్ళు కలిసి చేసే అందమైన ఫ్యామిలీ వెడ్డింగ్ ని హ్యాపీ వెడ్డింగ్ పేరుతొ తెరకెక్కించారు. మరి ట్రైలర్ అండ్ టీజర్స్ లో నిహారిక కట్టు, బొట్టు, సుమంత్ అశ్విన్ డీసెంట్ లుక్స్ అలాగే ఫ్యామిలీస్ మధ్య ఉన్న బాండింగ్స్, ఇంకా ఎమోషన్స్ అన్ని కలగలిపిన ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా ఈ సినిమా ఉండబోతుందనేది స్పష్టమైంది. మరి మెగాస్టార్ ఆశీస్సులతో.. భారీ ప్రమోషన్స్ తో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సాక్ష్యం సినిమా కి పోటీ ఇస్తూ.. ఈ రోజు శనివారం హ్యాపీ వెడ్డింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నిహారిక రెండో తెలుగు సినిమా ఎలా ఉండబోతుంది. అలాగే సుమంత్ అశ్విన్ ఇప్పటికైనా హ్యాపీ వెడ్డింగ్ తో హీరోగా నిలదొక్కుకుంటాడో లేదో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
అక్షర(నిహారిక) పబ్ సీన్ తో ఎంటర్ అవుతుంది. డిజైనర్ అయిన అక్షర ప్రతి దానికి కన్ఫ్యూజ్ అవుతుంది. తన బాయ్ ఫ్రెండ్ విజయ్(రాజా) పై కోపంతో విజయవాడ అబ్బాయి అయిన ఆనంద్(సుమంత్ అశ్విన్) ని ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా అక్షరాని ఇష్టపడతాడు.. అక్షర, ఆనంద్ రెండు కుటుంబ పెద్దలు అక్షరకి, ఆనంద్ కి పెళ్లి నిశ్చయం చేస్తారు. ఆనంద్ తండ్రి (నరేష్), అక్షర తండ్రి హనుమంతరావు(మురళిశర్మ) లు పెళ్లి పనుల్లో హడావిడిగా వుంటారు. ఇంతలో అక్షర గత జీవితంలో ప్రేమికుడు విజయ్ మల్లి అక్షరను వెత్తుకుంటూ వెనక్కు వస్తాడు. మళ్ళీ అక్షరకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తాడు విజయ్. అయితే లైఫ్ లో ప్రతి దానికి కన్ఫ్యూజ్ అవుతూ తీసుకునే నిర్ణయాలతో ప్రోబ్లెంస్ ని పేస్ చేస్తుంది. ఇక అక్షరుకి అక్షర పెళ్లి దాకా వచ్చిన ప్రేమ విషయంలో కూడా కన్ఫ్యూజన్ లోనే ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ తోనే ఆనంద్ తో బ్రేక్ అప్ అవడానికి కారణమవుతుంది. అక్షర లైఫ్ లో సంఘర్షణ మొదలవుతుంది. ఇక ఆనంద్ మాత్రం అక్షర ని వదులుకోవడానికి ఇష్టపడక... తనకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మరి అక్షర, ఆనంద్ పెళ్లి విషయంలో జరిగిన గందర గోళం వారి కుటుంబాలకు తెలుస్తుందా? అసలు అక్షర ఆనంద్ ని పెళ్లాడుతుందా? విజయ్ ని పెళ్లాడుతుందా? అనే విషయాలు తెలియాలి అంటే హ్యాపీ వెడ్డింగ్ సినిమా చూడాల్సిందే.
నటీనటులు నటన:
అక్షర కేరెక్టర్ లో నిహారిక చాలా అద్భుతమైన నటన కనబర్చింది. న్యూ లుక్స్ లో చాలా డీసెంట్ గా నిహారిక ఆకట్టుకుంది. గ్లామర్ లేకుండా కూడా అందాన్ని ఎక్సపోజ్ చెయ్యొచ్చు అనేది.. నిహారికకు చూస్తుంటే అర్ధమవుతుంది. అంత అందంగా ఈ సినిమా లో నిహారిక ఉంది. కేరెక్టర్ కి తగిన ప్రతిభను కనబర్చింది. అసలు నిహారిక తన తోలి సినిమా ఒక మనసులో కన్నా హ్యాపీ వెడ్డింగ్ లోనే మరింత అందంగా స్టైలిష్ గా నటించింది అని చెప్పవచ్చు. ఇక ఆనంద్ కేరెక్టర్ లో సుమంత్ అశ్విన్ కూడా మంచి నటన కనబర్చాడు. నిహారిక ని ప్రేమించే ఆనంద్ కేరెక్టర్ ని అలవోకగా చేసేసాడు సుమంత్. గత సినిమాల కన్నా సుమంత్ ఈ సినిమాలో అందంగా స్టైలిష్ గా నటనలో మెరుగ్గా కనబడ్డాడు. అసలు సెటిల్డ్ పెరఫార్మన్స్ అని చెప్పొచ్చు. కాపోతే డైలాగ్ డెలివరీలో మాత్రం సుమంత్ తేలిపోయాడు. ఇక నిహారిక తండ్రిగా చేసిన మురళి శర్మ.. ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఒకప్పుడు ప్రకాష్ రాజ్ మాదిరి ఇప్పుడు ఏ సినిమా లో చూసిన హీరో కి తండ్రిగానో.. హీరోయిన్ కి తండ్రిగాని నటిస్తూ అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ సినిమా కి మురళి శర్మ నటనే హైలెట్ అనేలా ఉంది. ఇక నిహారిక ఫస్ట్ లవర్ గా రాజా పర్వాలేదనిపించాడు. ఇక సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ఇంద్రజ, అన్నపూర్ణమ్మ ఇలా అందరూ తమ నటనతో మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ ఓ అన్నంతగా అనిపించలేదు. పాటలు సినిమాకి మైనస్ అనేలా ఉన్నాయి. బ్రాండ్ కోసం తీసుకున్నా, హైప్ కోసం వాడుకున్నా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో పెద్దగా చేసింది ఏమి లేదు. మరీ స్పెషల్ అని కాదు కానీ ఫీల్ అయితే క్యారీ చేసింది. ఇక సినిమాటోగ్రఫీ బాల్ రెడ్డి కెమెరా ఆహ్లదకరంగా ఉంది. కుటుంబం కలిసున్నా సీన్స్ ని మరింత అందంగా... విజువల్స్ ని బాగా చూపించాడు. కానీ హీరోయిన్ క్లోజ్ అప్ షాట్స్ ని తగ్గించుంటే బాగుండేది. ఎందుకంటే నిహారిక మేకప్ అంతగా అనిపించలేదు. మేకప్ విషయంలో శ్రద్ద తీసుకుంటే బావుండేది. ఇక ఎడిటింగ్ మైనస్ అనే చెప్పాలి. చాలా సీన్స్ డ్రాగ్ చేసినట్లుగా కత్తెర వేయాల్సిన సీన్స్ ని అలానే ఉంచేశారనే ఫీల్ తెప్పిస్తుంది. యువి వారి నిర్మాణ విలువలు కథానుసారముగా వున్నాయి.
విశ్లేషణ:
దర్శకుడు కుటుంబ నేపథ్యంలో కథను సెలెక్ట్ చేసుకుని మంచి ఇంప్రెషన్ కొట్టేశాడనే చెప్పాలి. ఇద్దరు ప్రేమికులు వాళ్లకు చెందిన రెండు కుటుంబాల మధ్య బాండింగ్ మధ్య ఎక్కువ ట్విస్టులు లేకుండా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి రాసుకున్న కథగా హ్యాపీ వెడ్డింగ్ ను సాధ్యమైనంత ఎంగేజ్ చేసేలా ప్రయత్నించాడు దర్శకుడు. ఫ్యామిలీ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పటికీ... అందులో రొటీన్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. హీరోయిన్ పబ్బులో వోడ్కా తాగి తందనాలాడితే రెండు కుటుంబాల పెద్దలు ఆదసలు తప్పే కాదన్నట్టు సమర్ధించడం ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ కాదు. తాగుడు అలవాటు ఉన్న బిడ్డల తల్లితండ్రులు కూడా మెజారిటీ కన్విన్స్ కారు. ట్రెండ్ పేరుతో కవర్ చేసినా సింక్ కాలేదు. పబ్బు సీన్ కాగానే హ్యాపీ వెడ్డింగ్ అని టైటిల్ వేయటం దగ్గరే లక్ష్మణ్ క్రియేటివిటీ బయట పడింది. ఇక హీరో హీరోయిన్ మధ్యన రొమాంటిక్ యాంగిల్ బాగా చప్పగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ నేచురల్ గా ఎంటర్టైన్మెంట్ తో సాగిన సినిమా కాస్తా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎమోషన్స్ సినిమాని తినేసింది. మరి మెగా డాటర్ ని మంచిగా చూపిస్తే ఇండస్ట్రీలో తనకి మంచి పేరొస్తుందేమో అనుకున్నట్లుగా ఉంది దర్శకుడు పనితీరు. అందుకే నిహారికకు ఎక్కువగా హైలెట్ చేస్తూ చూపించాడు. సినిమా మొత్తం ఒక వెబ్ సీరీస్ ని తలపిస్తుంది. సీరియల్ తరహా టేకింగ్ తో కథ ఎంతకీ ముందుకు సాగుతున్నట్టు అనిపించదు. ఇందులో అదే ప్రధాన లోపం. రెండు భిన్న మనస్తత్వాల మధ్య ప్రేమను పుట్టించి అందులో నుంచే డ్రామా క్రియేట్ చేయటం అనే పాయింట్ కొత్తది కాదు. ఇక క్లైమాక్స్ కి వచ్చేసరికి మరీ తేలిపోయింది. క్లైమాక్స్ మరీ రొటీన్ మాదిరి... ఇదివరకే చాలా సిఎంమా ల్లో చూసేసాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది.
ప్లస్ పాయింట్స్: నిహారిక, కుటుంబ విలువలు, డైలాగ్స్, సీనియర్ నటుల పెరఫార్మెన్సు, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: పాటలు, ఎడిటింగ్, క్లైమాక్స్, దర్శకత్వం, స్లో నేరేషన్, సెకండ్ హాఫ్
రేటింగ్: 2.25/5