Sun Dec 22 2024 19:13:28 GMT+0000 (Coordinated Universal Time)
రాధేశ్యామ్ రివ్యూ
విక్రమాదిత్య (ప్రభాస్) పేరు మోసిన జ్యోతిష్యుడు. ఇటలీలో నివసిస్తుంటాడు. హస్త సాముద్రికంలో ఆయన అంచనాలు..
సినిమా - రాధేశ్యామ్
నటీనటులు - ప్రభాస్, కృష్ణంరాజు, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, మురళి శర్మ, పూజా హెగ్డే, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జయరామ్, శేషా ఛట్రీ
సంగీతం - జస్టిన్ ప్రభాకరన్ (తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం), మిథున్, అనూమాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ)
సినిమాటోగ్రఫీ - మనోజ్ పరమహంస
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్షన్ కొరియోగ్రఫీ - నిక్ పావెల్
డైరెక్టర్ ఆఫ్ కొరియోగ్రఫీ - వైభవి మర్చంట్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు - కె కె రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు - వంశీ, ప్రమోద్, ప్రసీధ
బ్యానర్స్ - గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్
విడుదల - 11-03-2022
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. నాలుగేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాలుగేళ్లుగా రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ..విడుదలపై దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇదిగో అదిగో అంటూ.. మొత్తానికి ఈ శుక్రవారం రాధేశ్యామ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సరిగ్గా రాధేశ్యామ్ విడుదల సమయానికి ఏపీలో టికెట్ల రేట్లను పెంచుతూ కొత్త జీఓ విడుదల చేసింది. ఇది రాధేశ్యామ్ కు కాస్త కలిసొచ్చే విషయమనే చెప్పాలి. సాహో తర్వాత.. ప్రభాస్ హీరో వస్తోన్న భారీ బడ్జెట్.. పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ అభిమానుల్లో కాస్త ఉత్కంఠ నెలకొంది.
కథేంటంటే..
విక్రమాదిత్య (ప్రభాస్) పేరు మోసిన జ్యోతిష్యుడు. ఇటలీలో నివసిస్తుంటాడు. హస్త సాముద్రికంలో ఆయన అంచనాలు 100 శాతం నిజమవుతుంటాయి. విక్రమాదిత్య చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. అందరి చేతి రేఖలను బట్టి వారి భవిష్యత్ చెప్పే విక్రమాదిత్య చేతిలో ప్రేమ రేఖ లేదని తెలుసుకుంటాడు. తన జీవితంపై ఒక స్పష్టమైన అంచనాతో ఉంటాడు. కానీ.. అనుకోకుండా ప్రేరణ (పూజా హెగ్డే)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ.. తన జీవితంలో ప్రేమకు చోటులేదనుకుంటూ దూరమవ్వాలని ప్రయత్నిస్తాడు. విధి ఆ ఇద్దరినీ ఎలా కలిపింది? వారి జీవితాల్లో జరిగిన సంఘర్షణ ఏంటి ? తెలియాలంటే మిగతా కథ తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
మన రాత మన చేతుల్లో లేదు, చేతల్లో ఉంటుందన్న విషయాన్ని ప్రేమతో ముడిపెట్టి చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. బాహుబలి సినిమాల తర్వాత.. విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు ప్రభాస్. కానీ.. సినిమాలో ప్రభాస్ ఇమేజ్ కి తగిన మాస్ అంశాలు లేకపోవడం సగటు ప్రేక్షకుడిని కాస్త నిరాశ పరుస్తుంది. పీరియాడిక్ రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన సినిమా కాబట్టి.. అందుకు తగిన సంఘర్షణతోనే సినిమా సాగుతుంది. సినిమాలో పూజా హెగ్డే - ప్రభాస్ ల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఆన్ స్క్రీన్ పై ఈ జోడీ ఎంతో అందంగా కనిపించింది. జ్యోతిషం ఒక శాస్త్రం అని చెప్తూనే.. మనరాతని మనమే రాసుకోవచ్చిన చెప్పిన తీరులో స్పష్టత ఉంటుంది.
ఫస్టాఫ్ అంతా యూరప్ లో జరుగుతుంది. హీరో హీరోయిన్ మధ్య పరిచయం, ప్రేమ చాలా ఆహ్లాదంగా సాగుతుంది. హీరోయిన్ తో కలిసి ట్రైన్ లో చేసే విన్యాసం చాలా బాగుంటుంది. అలాగే జగపతిబాబు చేయిచూసి జాతకం చెప్పడం, ఆస్పత్రిలో శవాల హస్త ముద్రల్ని చూసి వాళ్ల గురించి విక్రమాదిత్య చెప్పడం వంటి సన్నివేశాలు మెప్పిస్తాయి. విక్రమ్ - ప్రేరణలు కలుసుకోవడం ఒక ఎత్తొతే.. ప్రేరణ విక్రమాదిత్యను ప్రేమించడం మొదలయ్యాక కథ మలుపు తీసుకోవడం మరో ఎత్తు.
ప్లస్ పాయింట్స్
+ ప్రభాస్ - పూజా జోడీ
+ జ్యోతిషం నేపథ్యంలో సాగే ప్రేమకథ
+ పాటలు, విజువల్స్
మైనస్ పాయింట్స్
- ప్రభాస్ ఇమేజ్ కి తగ్గ సన్నివేశాలు లేకపోవడం
- భావోద్వేగాల మోతాదు తగ్గడం
మొత్తానికి "రాధేశ్యామ్" క్లాస్ గా సాగే ఓ ప్రేమకథ
Next Story