' కృష్ణార్జున యుద్ధం ' షార్ట్ & స్వీట్ రివ్యూ
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో తనదైన శైలీలో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ దర్శకుడు మేర్లపాక గాంధీ, ఇటు వరుస విజయాలతో దూసుకుపోతోన్న నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా కృష్ణార్జున యుద్ధం. ఈ సినిమా హిట్ అయితే ఇటు నానికి ట్రిబుల్ హ్యాట్రిక్, అటు దర్శకుడికి తొలి హ్యాట్రిక్ కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఈ రోజు వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ఈ షో తర్వాత సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందో తెలుగుపోస్ట్.కామ్ షార్ట్ & స్వీట్ రివ్యూలో చూద్దాం.
నాని కృష్ణుడు, అర్జునుడిగా రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు. రెండు పాత్రలు, వారి మధ్య సీన్లు రాసుకున్న విధానం ఆకట్టుకుంది. నాని రెండు పాత్రల్లోనూ చక్కగా సెట్ అయ్యాడు. ఫస్టాఫ్‌లో చూస్తే ఆసక్తికరమైన మరియు సరదా సన్నివేశాలతో బాగానే ఆకట్టుకొంది. అలాగే అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్లతో సినిమా డీసెంట్ గా నడిచింది. ఇంటర్వెల్ బ్లాక్ ఆసక్తికరంగా ఉండి సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.
ఇక కామెడీ రొటీన్‌గానే ఉన్నా కమర్షియల్‌గా ప్రేక్షకులకు నచ్చేలా ఉండడంతో దీనిని ఎవ్వరూ పట్టించుకోరు. రెండు క్యారెక్టర్లు ఫస్టాఫ్‌లో హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, రుక్స్ర్ మీర్లతో ప్రేమలో పడతారు. తర్వాత వారికి దూరమవుతారు. తిరిగి వారిని కలుసుకునే క్రమంలోనే హీరోలు ఇద్దరూ కలుస్తారు. స్క్రీన్ ప్లే సినిమాకు చాలా ప్లస్. ఫస్టాఫ్‌లో ట్విస్ట్ సినిమాకు మెయిన్ హైలెట్.
ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత సెకండాఫ్‌పై భారీ అంచనాలు ఉన్నా అవి దర్శకుడు అందుకోలేదు. సెకండాఫ్‌లో స్లో నరేషన్ కూడా మైనస్. ఓవరాల్‌గా చూస్తే నాని ఫ్యాన్స్‌కు బాగా నచ్చే ఈ సినిమా నాని నుంచి కొత్తదనం కోరుకునే వారికి మరీ అంతగా నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఉన్న నాని ఫామ్‌ను బట్టి చూస్తే సినిమా బిలో యావరేజ్‌గా ఉన్నా, యావరేజ్‌గా ఉన్నా హిట్ అయిపోతోంది. మరి కృష్ణార్జున యుద్ధం కూడా అదే కోవలో చేరిపోతుందేమో ? చూడాలి.
కృష్ణార్జున యుద్ధం పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుపోస్ట్.కామ్