Mon Dec 23 2024 00:39:44 GMT+0000 (Coordinated Universal Time)
Mahesh Babu: మహేష్ ఒంటరిగా జర్మనీ వెళ్ళింది.. డాక్టర్ని కలవడం కోసమా..
మహేష్ బాబు జర్మనీకి ఒంటరిగా వెళ్ళింది ఒక డాక్టర్ ని కలవడం కోసమా..? మహేష్ ఎందుకని డాక్టర్ ని కలుసుకున్నారు.
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫారిన్ ట్రిప్స్ ని ఎక్కువుగా ఫ్యామిలీతోనే వేస్తుంటారు. కానీ రీసెంట్ గా మహేష్ జర్మనీకి సోలో ట్రిప్ వేశారు. ఫ్యామిలీతో కాకుండా మహేష్ ఇలా ఒంటరిగా వెళ్లడం చూసి.. ఫ్యాన్స్ అంతా ఇది SSMB29కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే అని అనుకున్నారు. అయితే మహేష్ బాబు జర్మనీకి వెళ్ళింది ఒక డాక్టర్ని కలుసుకునేందుకు. మహేష్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోతో ఇది తెలిసింది.
అయితే ఆ డాక్టర్ని మహేష్ కలుసుకోవడం ఇది ఫస్ట్ టైం ఏమి కాదు. గతంలో కూడా మహేష్ రెండుసార్లు ఆ డాక్టర్ ని కలుసుకున్నారు. 2023 ఏప్రిల్, 2022 జూన్లో మహేష్ తనని కలుసుకున్న ఫోటోలను ఆ డాక్టర్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇంతకీ ఆ డాక్టర్ ఎవరంటే.. అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బట్టి అతను బాడీ ఫిట్నెస్ డాక్టర్ అని తెలుస్తుంది. ఇటీవల కాలంలో మహేష్ బాబు తన బాడీ ఫిట్నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టి జిమ్ లో తెగ కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఫిట్నెస్ మంత్రాని ఆ డాక్టర్ నుంచే తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
మహేష్ బాబు గత కొంత కాలంగా జిమ్ లో భారీ కసరత్తులు చేస్తూ కనిపిస్తున్నారు. గ్యాప్ దొరికినప్పుడల్లా జిమ్ లోనే ఉంటున్నారు. ఇక వర్క్ అవుట్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా మహేష్ తన ఇన్స్టాలో షేర్ చేస్తూ వస్తున్నారు. ఇక అవన్నీ చూసిన ఆడియన్స్.. ఈ వర్క్ అవుట్స్ అన్ని రాజమౌళి సినిమా కోసమే అని అనుకుంటున్నారు. ఆ మూవీ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్గా అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగబోతోంది. ఈ సినిమాలో మహేష్ భారీ స్టంట్స్ చేయబోతున్నట్లు సమాచారం. అందుకే ఈ వర్క్ అవుట్స్ ని తెలుస్తుంది.
Next Story